పార్ ఆర్.మిల్‌గ్రోమ్, రాబర్ట్ బి.విల్సన్‌లను వరించిన బహుమతి
స్టాక్‌హోం: అర్థశాస్త్రంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి అమెరికా ఆర్థికవేత్తలు పార్ ఆర్.మిల్‌గ్రోమ్, రాబర్ట్ బి.విల్సన్‌లను వరించింది. వేలం సిద్ధాంతం, కొత్త వేలం ప్రక్రియలను కనిపెట్టినందుకు గానూ వీరిని నోబెల్‌తో సత్కరిస్తున్నట్లు స్వీడిష్ కమిటీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోటా ఎన్నో రంగాల్లో వేలం ప్రక్రియలు జరుగుతుంటాయి. ఆర్థికవేత్తలు పాల్ మిల్‌గ్రోమ్, రాబర్ట్ విల్సన్‌లు వేలం సిద్ధాంతాన్ని మరింత సరళీకరించడమేగాక, ఈ విధానంలో కొత్త పద్ధతులను కనిపెట్టారు. దీని వల్ల అటు విక్రయదారులు, కొనుగోలుదారులే గాక, పన్ను చెల్లింపుదారులు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు అని నోబెల్ కమిటీ పేర్కొంది. 1969 నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నారు. ఇప్పటివరకు 51 సార్లు ఈ అవార్డును ప్రకటించగా.. 84 మంది ఆర్థికవేత్తలు పురస్కారాన్ని అందుకున్నారు. నేటి ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన ముగిసింది.
అర్థశాస్త్రంలో ఇద్దరికి నోబెల్
RELATED ARTICLES