జిహెచ్ఎంసి ఎన్నికలకు చట్టసవరణ బిల్లు కోసం ప్రత్యేక సమావేశం: ఏర్పాట్ల పరిశీలించిన స్పీకర్
ప్రజాపక్షం /హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన చట్ట సవరణ చేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు ఆమోదం కోసం శాసనసభ మంగళవారం ఉదయం 11ః30 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇక్కడ ఆమోదం పొందిన బిల్లు ఆమోదం కోసం శాసనమండలి బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో శాసనసభ, శాసనపమండలి సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన పరిషత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. సభలో సభ్యుల మద్య భౌతిక దూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణం, సభ లోపల పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించాలని శాసనమండలి కార్యదర్శి డా. వి నరసింహాచార్యులును ఆదేశించారు. సమావేశాల బందోబస్తుపై రాష్ర్ట డిజిపి, నగర పోలీసు కమిషనర్‌తో, సమావేశాలలో అవసరమైన సమాచారంపై చీఫ్ సెక్రటరీతో స్పీకర్ పోచారం ఫోన్లో మాట్లాడారు. సమావేశాలకు హాజరయ్యే గౌరవ శాసనసభ, శాసన పరిషత్తు సభ్యులు, ఉభయ సభల సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బందిలలో ఎవరికైనా అనుమానంగా ఉన్నా లేదా కరోనా లక్షణాలు కనిపించినా ఉభయ సభల ప్రాంగణాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెస్టింగ్ కేంద్రాలలో తప్పక పరీక్షలు చేయించుకోవాల్సిందిగా స్పీకర్ పోచారం, చైర్మన్ గుత్తా సూచించారు.
vనేడు శాసనసభ
RELATED ARTICLES