సరికొత్త బానిసలుగా 29 మిలియన్ల మంది బాలికలు, మహిళలు
ఐక్యరాజ్య సమితి : వెట్టిచాకిరీ, బలవంతపు పెళ్లిళ్లు, కట్టుబానిసత్వం, ఇంటి చాకిరీ మొదలైన వాటివల్ల దోపిడీకి గురవుతూ 29 మిలియన్ల మంది బాలికలు, మహిళలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని ఒక నివేదిక అంచనా వేసిం ది. ప్రతీ 130మంది బాలికలు, మహిళ ల్లో ఒకరు ఆధునిక బానిసత్వంలో బతుకుతున్నారని, ఇది ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువని వాక్ ఫ్రీ యాంటీ స్లేవరీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు గ్రేస్ ఫారెస్ట్ అన్నారు. అయితే నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. మానవ చరిత్రలో ఇదే అత్యధి కం అని ఆమె ఐరాస వార్తా సమావేశంలో వెల్లడించారు. మనిషి స్వేచ్ఛను హరించడం, వ్యక్తిగత, ఆర్థిక లబ్ధికి మనిషిని దోపిడీకి గురిచేయడమే ఆధునిక బానిసత్వం అన్నది ఈ సంస్థ నిర్వచనం. ఆడపిల్లలు కడుపులో పడింది మొదలు వారి జీవితం మొత్తం ప్రతికూలతల మధ్యే బతకాల్సి వస్తోందని నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం బాధితుల్లో 99 శాతం బలవంతపు లైంగిక దోపిడీకి, 84 శాతం బలవంతపు పెళ్లిళ్లు, 58 శాతం వెట్టి చాకిరీకి గురవుతున్నారు. విదేశాలకు చేరవేయడం, వలస మార్గాల ద్వారా మన ఆర్థిక వ్యవస్థలో దోపిడీ అనేది ఒక సాధారణ అంశంగా మారింద ని, అలా ఆధునిక బానిసత్వ రూపం ‘విపరీతంగా మారింద’ని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ 19 కారణంగా బలహీనులు మరింతగా ఆధునిక బానిసత్వంలోకి వెళ్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలు, దోపిడీకి గురిచేసే పని పరిస్థితుల్లో పెరుగుదల తీవ్రంగా ఉందన్నారు గ్రేస్. ఈ ఆధునిక బానిసత్వం మీద పోరాటానికి వాక్ ఫ్రీ, ఐక్యరాజ్య సమితి ‘ఎవ్రీ వుమెన్, ఎవ్రీ చైల్డ్’ కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు ఆమె చెప్పారు.
ఆధునిక భానిసత్వం
RELATED ARTICLES