న్యూఢిల్లీ కేంద్ర మంత్రి, ఎల్జేపీ అగ్రనేత రామ్‌విలాస్ పాసవాన్ కన్నుమూశారు. తండ్రి మరణాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ ధ్రువీకరించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో గుండెకు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. తండ్రి మృతిని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ధ్రువీకరించారు. పాసవాన్ 5 దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. దేశంలోని ప్రముఖ నేతల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఉన్నారు. పోలీసు ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించిన దివంగత నేత రామ్ విలాస్ పాసవాన్.. జాతీయ నేతగా ఎదిగారు. దళిత నాయకుడిగా పేరుగాంచారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. పలు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. బిహార్‌లో దళితుల నాయకుడిగా పేరుగాంచిన దివంగత నేత రామ్ విలాస్ పాసవాన్.. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. లోక్‌జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యస్థాపకుడైన పాసవాన్.. ‘శతాబ్దాల చీకటి నిండుకున్న ఇంట్లో దీపం వెలిగిస్తాను‘ అనే నినాదంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. బిహార్ పోలీసు ఉద్యోగాన్ని వదిలి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు పాసవాన్. ఇప్పటివరకు ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బిహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అస్తమయం
RELATED ARTICLES