కొత్త వ్యవసాయ బిల్లుపై రాజ్యసభ ఎంపి కేశవరావు ఫైర్
న్యూఢిల్లీ: రాష్ట్రాలను నష్టపరిచే చర్యలకు కేంద్రం పాల్పడుతోందని టిఆర్ఎస్ ఎంపి కె. కేశవరావు ఆరోపించారు. కాంట్రాక్టు వ్యవసాయం పేరిట రైతులకు స్వేచ్ఛ లేకుం డా చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్లు వ్యవసాయంపై ఆధిపత్యం చలాయించే పరిస్థితి తీసుకొస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం సంక్షోభంలో పడేలా కొత్త బిల్లులు ఉన్నాయని, స్వదేశీ పంటలను గాలికొదిలేసి, విదేశీ పంటల దిగుమతులను ప్రోత్సహించడం సరికాదన్నారు. ఇతర దేశాల నుంచి మొక్కజొన్న, బియ్యాన్ని దిగుమతి చేసుకోవవద్దని, స్వదేశీ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. విదేశీ పంటలపై దిగుమతి పన్నులు తగ్గించడం దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టమని, మార్కెట్ కమిటీలు, మార్కెట్ యార్డులు, గోదాముల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కేంద్రం ప్రోత్సహించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. మార్కెట్లు, వ్యవసాయ సంబంధిత అంశాలన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేవని, కొత్త బిల్లులతో కేంద్రం చేతిలోకి వెళ్లి రాష్ట్రాల పాత్ర తగ్గిపోతుందని కేశవరావు వివరించారు.
రైతులకు తీవ్ర అన్యాయం : నామా
దేశవ్యాప్తంగా రైతాంగం దెబ్బతినేలా ఆర్డినెన్సులు తెచ్చారని టిఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు అన్నారు. లోక్సభలో మెజార్టీ ఉందని బిల్లులు పాస్ చేశారని మండిపడ్డారు. ‘బడా కంపెనీలకు మేలు జరిగేలా కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. పెద్ద కంపెనీలకు ప్రభుత్వ భూములను అప్పగించేందుకే కొత్త బిల్లులను కేంద్రం తీసుకొస్తోంది. రైతాంగానికి నష్టం చేకూర్చేలా ఉన్న బిల్లులను రాజ్యసభలో అడ్డుకుంటాం. రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా, రైతులపై కేంద్రం కక్షసాధింపు చర్యలు తగదు. రాజ్యసభలో వాటిని వ్యతిరేకించి అడ్డుకుంటాం. ఈ బిల్లులతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. విదేశీ రైతులకు మేలు చేసేలా దిగుమతి సుంకం తగ్గించారని’ నామా మండిపడ్డారు.
వ్యవసాయం సంక్షోభంలో పడేలా…!
RELATED ARTICLES