ఐక్యరాజ్యసమితి: కరోనాను నిలువరించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్న తీర్మానాని కి ఐక్యారాజ్యసమితి భారీ మెజారిటీతో ఆమోదించింది. యుఎన్‌లోని 169 సభ్యదేశాలు ఈ తీర్మానానికి తమ మద్దతు తెలిపాయి. ఏకగ్రీవ ఆమోదం లభించాలని సభ్య దేశాలు ఆశించినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్‌లు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరోవైపు.. యుక్రెయిన్, హం గరీ దేశాలు వోటింగ్‌కు దూరంగా ఉన్నాయి. కాగా.. కరోనాపై ఐక్యరాజ్యసమితి ఆమోదించిన మూడో తీర్మానం ఇది. అంతకుమనుపు.. ఏప్రిల్ 2న కరోనాపై తొలి తీర్మానాన్ని యుఎన్ ఆమోదించింది. మునుపెన్నడూ ప్రపంచం చూడని సమస్యలను కరోనా తెచ్చిపెట్టిందంటూ ఆ తీర్మానంలో సభ్యదేశాలు అంగీకరించాయి. అనంతరం.. ఏప్రిల్ 20న మెక్సిసో ప్రవేశపెట్టిన రెండో తీర్మానానికి కూడా ఐక్యారాజ్య సమితి ఆమోదం లభించింది. కరోనాపై పోరాడేందుకు ఔషధాల తయారీని మరింత పెద్ద ఎత్తున చేపట్టాలంటూ మెక్సికో తన తీర్మానంలో ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ విపత్కర సమయంలో వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక తాజాగా శుక్రవారం నాడు ఆమోదించిన తీర్మానంలో.. ఐక్యరాజ్య సమితి కరోనాను మునుపెన్నడూ చూడని ప్రపంచస్థాయి సవాలుగా అభివర్ణించింది. ఐక్యరాజ్యసమితి చిరిత్రలోనే ఇది మునుపెన్నడూ ఎరుగని పరిస్థితి అని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి కోసం అన్ని రకాల వైద్య సేవలూ, ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ సభ్య దేశాలను యూఎన్ పిలుపు నిచ్చింది.
కరోనాపై తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం!
RELATED ARTICLES