HomeNewsకొత్తగా 2932 పాజిటివ్‌ కేసులు

కొత్తగా 2932 పాజిటివ్‌ కేసులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కొత్తగా 2932 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు 799 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం 1,17,415 మందికి కరోనా సోకింది. ఈ మేరకు గురువారం నాటి కరోనా హెల్త్‌ బులెటిన్‌ను వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 1580 మంది కోలుకోగా ఇప్పటి వరకు మొత్తం 87,675 మంది కోలుకున్నారు. కోలుకున్నవారి రేటు రాష్ట్రంలో 74.6 శాతం కాగా జాతీయ స్థాయిలో 76.33 శాతం ఉన్నది. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.68 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 1.83గా నమోదైనట్టుగా వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం 28,941 యాక్టివ్‌ కేసులు ఉండగా, గృహం, ఇతర సంస్థలలో 22,097 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. గురువారంనాడు 61,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 771 రిపోర్టులు రావాల్సి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,04,343 కరోనా పరీక్షలు నిర్వహించారు.టెలి మెడిసిన్‌, వివిధ సమస్యల పరిష్కారానికి 104కు ఫోన్‌ చేయాలని, ప్రైవేటు ఆస్పత్రులు,ల్యాబరేటరీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి 9154170960 నంబర్‌కు ఫోన్‌ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ లెక్కలు ఇలా ఉన్నాయి:
గురువారం నాడు ఆదిలాబాద్‌లో 25, భద్రాద్రి-కొత్తగూడెంలో89, జిహెచ్‌ఎంసిలో 520, జగిత్యాలలో 113, జనగామలో 38, జయశంకర్‌ భూపాల్‌పల్లిలో13, జోగులాంబ గద్వాల్‌లో46,కామారెడ్డిలో51,కరీంనగర్‌లో168, ఖమ్మంలో 141, కొమురంబీమ్‌ ఆసిఫాబాద్‌లో15, మహబూబ్‌నగర్‌లో 67,మహబూబాబాద్‌లో 76,మంచిర్యాలలో 110, మెదక్‌లో24, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 218,ములుగులో18,నాగర్‌కర్నూల్‌లో42,నల్లగొండలో 159,నారాయణపేట్‌లో16, నిర్మల్‌లో 32, నిజామాబాద్‌లో129, పెద్దపల్లిలో 60,రాజన్న సిరిసిల్లాలో64,రంగారెడ్డిలో 218, సంగారెడ్డిలో 49, సిద్దిపేటలో 100, సూర్యాపేటలో102, వికారాబాద్‌లో 22,వనపర్తిలో 51,వరంగల్‌ రూరల్‌లో34,వరంగల్‌ అర్బన్‌లో 80,యాదాద్రి-భువనగిరిలో 42 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments