HomeNewsLatest Newsవచ్చే ఏడాది చంద్రయాన్‌-3

వచ్చే ఏడాది చంద్రయాన్‌-3

భూమిపై జాబిల్లి బిలాల సృష్టి : ఇస్రో

బెంగళూరు : చంద్రునిపై పరిశోధనలో భాగంగా చంద్రయాన్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రయాన్‌ చంద్రయాన్‌ ప్రయోగించిన ఇస్రో… తాజాగా చంద్రయాన్‌ 3 ప్రయోగానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది మొదట్లో చంద్రయాన్‌ నిర్వహించనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ’చంద్రయాన్‌- విజయవంతంగా ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్‌- సాఫ్ట్‌ ల్యాండింగ్‌ వైఫల్యంపై దృష్టి పెట్టింది. చంద్రునిపై ఉన్న బిలాలను కృత్రిమంగా సృష్టించి ల్యాండింగ్‌ ప్రక్రియను పరిశీలించాలని భావిస్తోంది. ఈ మేరకు బెంగళూరుకు 215 కిలోమీటర్ల దూరం ఉన్న చల్లాకేరెలో ఉల్లార్తిలో కృత్రిమ చంద్ర బిలాలను సృష్టించనుంది. దీనికి సుమారు రూ.24.2 లక్షలు ఖర్చవుతుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లకు ఇస్రో ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తవ్వకాల పనులను ఏదైనా ఒక సంస్థకు అప్పగించే ప్రక్రియ ఆగస్టు చివరినాటికి లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ బిలాలు 10 మీటర్ల వ్యాసం, 3 మీటర్ల లోతు ఉంటాయని మరో శాస్త్రవేత్త తెలిపారు. చంద్రుని ఉపరితలంపై ఉన్న మాదిరిగా వీటిని నిర్మిస్తారని, ఇక్కడ ల్యాండింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తారని చెప్పారు. ఈ పరీక్షల్లో సెన్సార్లు అమర్చిన ఇస్రో విమానాన్ని ఉపయోగించనున్నారు. ఆ ప్రదేశంలో 7 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిర్ధిష్ట ప్రదేశంలో ల్యాండింగ్‌ను పరీక్షిస్తారు. సుమారు 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు విమానానికి సెన్సార్లు ఎలా మార్గనిర్దేశం చేస్తాయో పరిశీలించనున్నారు. ల్యాండర్‌లో వినియోగించే సెన్సార్ల పనితీరు పరీక్ష (ఎల్‌ఎస్‌పిటి నిర్వహిస్తారు. దీనిద్వారా కృత్రిమంగా రూపొందించిన చంద్రుని ఉపరితలంపై ఇస్రో ల్యాండర్‌కు మార్గనిర్దేశం చేయటంలో సెన్సార్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయో అవగాహనకు వస్తారు. చంద్రయాన్‌- కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినది కావటం గమనార్హం. ఈ మిషన్‌లో అనేక సెన్సార్లను ఇస్రో వినియోగనుంది ల్యాండింగ్‌ వేగంతో పాటు చంద్రుని ఉపరితలంపై అసమానతలను గుర్తించి ల్యాండర్‌కు సమాచారం ఇస్తుంది. చంద్రయాన్‌ మించి ఈ సారి ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తోంది. బెంగళూరులోని ‘ఇస్రో శాటిలైట్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్ట్‌ ఎస్టాబిలిష్‌మెంట్‌’ (ఐసైట్‌)లో పూర్తి స్థాయి ల్యాండర్‌పై పరిశోధనలు చేస్తున్నట్లు ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. అది ఏ స్థాయి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. చంద్రయాన్‌ ప్రయోగానికి ముందు కూడా ఇలాంటి బిలాలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు . అయితే ఇవి బహిరంగ ప్రదేశంలో జరిగాయని, అందుకే వాటిలో నాణ్యత కొరవడిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే కొత్త బిలాలను సృష్టిస్తున్నట్లు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments