విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డులో కుప్పకూలిన క్రేన్
11 మంది దుర్మరణం
మృతుల్లో నలుగురు హెచ్ఎస్ఎల్ ఉద్యోగులు
ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం
విశాఖపట్నం : విశాఖ నగరంలోని హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో ఘోర ప్రమా దం చోటు చేసుకుంది. క్రేన్‌ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో 11 మంది చనిపోయారు. క్రేన్ కింద పలువురు చిక్కుకున్నట్టు భావిస్తున్నా రు. విరిగిపడ్డ క్రేన్‌ను తొలగించేందుకు చర్య లు కొనసాగుతున్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి బంధువులు షిప్ యార్డుకు చేరుకున్నారు. అయితే వారిని లోనికి అనుమతించడం లేదు. ఈ భారీ క్రేన్ బరువు 75 మెట్రిక్ టన్నులు. 10 ఏళ్ల కిందట దీనిని షిప్ యార్డు కార్యకలాపాల నిమిత్తం కొనుగోలు చేశారు. ఈ క్రేన్ హిందూస్థాన్ షిప్ యార్డుకు చెందినదే అయినా దాని నిర్వహణను ఇటీవలే ఔట్ సోర్సింగ్ సంస్థకు అప్పగించినట్టు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా విశాఖలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్జి గ్యాస్ లీకేజీ, ట్యాంక్ పేలుడు లాంటి ప్రమాదాలు జరగ్గా తాజాగా షిప్ యార్డు దుర్ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన మూడు నెలల్లో జరిగిన వరుస ఘటనలు సరికొత్త చర్చకు తావిస్తున్నాయి.
ఘటనపై సిఎం జగన్ ఆరా
షిప్‌యార్డులో జరిగిన ఘోర ప్రమాదం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సిఎం తెలుసుకున్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు
ప్రమాదంపై రెండు కమిటీలు
హిందూస్థాన్ షిప్ యార్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. క్రేన్ ఆపరేషన్, మేనేజ్మెంట్లో మొత్తం మూడు కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయని చెప్పారు. మృతుల్లో నలుగురు హెచ్ఎస్ఎల్ ఉద్యోగులు కాగా.. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెందినవారని పేర్కొన్నారు. క్రేన్ కుప్పకూలిన సమయంలో కేబిన్‌లో 10 మంది ఉన్నారని తెలిపారు. కేబిన్‌లో ఉన్న పదిమందితోపాటు మరొకరు మృతి చెందారని వివరించారు. ప్రమాద కారణాల కోసం కమిటీ ఏర్పాటుకు హెచ్ఎస్ఎల్ ఛైర్మన్‌ను కోరామన్నారు. హెచ్ఎస్ఎల్ ప్రమాదంపై రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎయు మెకానికల్ ఇంజినీరింగ్ నిపుణులతో కమిటీ, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగం నుంచి కమిటీ వేస్తామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
మాయదారి క్రేన్ మింగేసింది!
RELATED ARTICLES