సచివాలయ నిర్మాణం, నియంత్రిత వ్యవసాయం, కరోనాపై చర్చ
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహిస్తారు. సచివాలయం నూతన భవన సముదాయం నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కరోనా వ్యాప్తి, కొవిడ్ నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకుంటున్న కృష్ణా జలాల వివాదాలు తదితర అంశాలను కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని సమాచారం.
5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
RELATED ARTICLES