ఎస్‌ఎల్‌బిసి, నక్కలగండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలి : సిపిఐ డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్రాల మధ్య నీటి తగవులు పెరిగే అవకాశం వున్నందున కృష్ణా జలాల వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చొరవ చూపి అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసి కృష్ణా జలాలు వినియోగానికి కృషి చేయాలని, నత్తనడకన నడుస్తున్న ఎస్‌ఎల్‌బి సి, నక్కలగండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. కృష్ణా జలాలను తెలంగాణ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోతే దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 నుండి 584కు పెంచడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందని, డ్యామ్ ఎత్తు పెంచ డం వల్ల నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం 100 టిఎంసిల నుండి 200 టిఎంసిలకు పెరుగుతుంద ని, ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీటి ఇబ్బందులు తలెత్తుతాయని ఆయ న వివరించారు. ఈ విషయాలను తెలు గు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచకుండా చర్యలు చేపట్టాలని కోరారు. నికర జలాల విషయంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఉమ్మడి రాష్ర్టంలో నూ, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపయోగించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంగమేశ్వర్ నుంచి మూడు టిఎంసిల నీటిని, పోతిరెడ్డిపాడు నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకపోవడానికి అడుగులేస్తూ ఎపి ప్రభుత్వం జిఒలు కూడా ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కృష్ణానది నీటి వినియోగం బోర్డు వివిధ ప్రాజెక్టుల మీద డిపిఆర్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోరినప్పటికీ వారు స్పందించకపోవడంతో అనుమతులు వచ్చేవరకు టెండర్లు పిలవద్దని ఆదేశించడం ఒక రకంగా మంచి పరిణామమేనని ఆయన పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద 25 టిఎంసిల రిజర్వాయర్ కడితే సబబుగా వుంటుందని చాడ వెంకట్‌రెడ్డి సూచించారు.
కృష్ణా జలాల వినియోగంపై అఖిలపక్షం
RELATED ARTICLES