70 శాతం నిధులకు అనుమతి నిబంధనలకు లోబడే పనులు
త్వరలోనే ప్రతిపాదనలు పంపాలన్న మున్సిపల్ శాఖ ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్ : మున్సిపాలిటీల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టేందుకు ఎల్‌ఆర్‌ఎస్ నిధులను ఉపయో గించేందుకు అన్ని మున్సిపాలిటీలకు మున్సిపల్ శాఖ అనుమతినిచ్చింది. మున్సిపాలిటీలు వసూలు చేసిన ఎల్‌ఆర్‌ఎస్ నిధుల్లో 70 శాతం సిటీ లెవల్ డెవలప్‌మెంట్ పనులకు ఖర్చు పెట్టనున్నారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ సంచాలకులు డాక్టర్ ఎన్. సత్యనారాయణ సర్క్యులర్‌ను జారీ చేశారు. మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ స్కీము ద్వారా ఫీజులను వసూ లు చేశారు. ఆ ఫీజుల ద్వారా వసూలైన నిధులను పలు అభివృద్ధి పనులను ఖర్చు చేసేందుకు అనుమతినివ్వాలని ఇది వరకే పలు మున్సిపాలిటీలు ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించాయి. దీం తో ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అయితే తెలంగాణ రెగ్యులరైజేషన్, జరిమానాలు, అక్రమ కట్టడాలు, అలాగే నిబంధనలు ఉల్లంఘించిన భవనాలకు, అక్రమ లే అవుట్ల (ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా వసూలు చేసిన ఫీజులను ఏ పనులకు, ఎలా వాడుకోవాలనే విషయమై నాటి ఉమ్మడి రాష్ట్రంలో 2010 సంవత్సరంలోనే జిఒను విడుదల చేశారు. వాటికి అనుగుణంగా కలెక్టర్ ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఎల్‌ఆర్‌ఎస్ నిధుల వినియోగానికి మున్సిపల్ శాఖ అంగీకరించిన నేపథ్యంలో ఇది వరకు అమలులో ఉన్న జిఒ ఆధారంగా కలెక్టర్ మార్గదర్శకాలకు లోబడి వినియోగించుకోవాలని మున్సిపల్ శాఖ సూచించింది. అదే సమయంలో ఆయా మున్సిపాలిటీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కౌన్సిల్ తీర్మానంతో పాటు కలెక్టర్ మంజూరు కూడా అవసరమేనని సూచించింది.
పనుల ప్రతిపాదనలకు సన్నద్ధం
ప్రస్తుతం మున్సిపాలిటీల వద్ద ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ నిధుల్లో 70 శాతం నిధులున ఏ పనులకు కేటాయిస్తున్నారనే విషయమై మున్సిపల్ శాఖకు ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి, కౌన్సిల్ తీర్మానాలు, కలెక్టర్ మంజూరు ఇలా నిబంధనలకు లోబడి ఎలాంటి పనులను చేపడుతున్నారో ఆయా మున్సిపాలిటీలు ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును త్వరితగతిన పూర్తి చేస్తే వాటికి ఆమోదముద్ర వేయాలని మున్సిపల్ శాఖ యోచిస్తోంది.
‘ఎల్‌ఆర్‌ఎస్’ నిధులతో అభివృద్ధి పనులు
RELATED ARTICLES