మనం తీసుకునే జాగ్రత్తలే ముఖ్యం : మంత్రి ఈటల
ప్రజాపక్షం/హైదరాబాద్కరోనాకు వ్యాక్సిన్ వచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదని మేధావులు చెబుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పరిశోధనలు చేస్తున్న వారితో చర్చలు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు అధునాతన చికిత్సకు సమాచారాన్ని అందిస్తామన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్, బిఆర్కె భవన్‌లోని తాత్కాలిక సచివాలయం నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెడెంట్లు, వైద్య సిబ్బందితో మంత్రి ఈటల రాజేందర్ గురువారం వీవిడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, డిఎంఇ రమేష్‌రెడ్డి, వి.సి.కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ 99 శాతం మందిలో వెంటీలేటర్, రెమెడిస్వర్ లాంటి మందులు అవసరం లేదని, యాంటీ ఇన్లమాటొరి మందులు సకాలంలో ఉపయోగిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. కరోనాను ముందుగా గుర్తించి, చావులను అరికడదామని, చాలామందికి కరోనా ఉన్న కూడా తెలియడంలేదని చెప్పారు. ప్రజలకు ధైర్యాన్ని కలిపించడం మన ముందున్న లక్ష్యమని, భ యం తోనే చాలా మంది చనిపోతున్నారని చెప్పారు. తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని, అందరం అదే స్పూర్తి తో పని చేద్దామని అధికారులకు మంత్రి సూచించారు. ప్రతి సుపరింటెండెంట్ పూర్తి సామర్ధ్యంతో పని చేయాలని, ప్రతి పేషంట్‌ను హాస్పిటల్‌కు రాగానే అడ్మిట్ చేసుకోవాలని, స్టెబిలైసె చేసిన తరువాతనే పెద్ద ఆసుపత్రులకు పంపించాలని సూ చించారు. 95 శాతం మంది పేషంట్లకు ఎలాంటి సమస్య ఉండదని, మిగిలిన 5 శాతం మంది కోసమే మనం కాష్టపడాలని, అవసరమైతే సిబ్బందిని నియామకం చేసుకోవాలని తెలిపారు. ఒక్క మనిషి విషయంలో కూడా నిర్ల క్ష్యం వద్దన్నారు. హాస్పిటల్స్‌కు ఉన్న అన్ని బకాయిలను చెల్లిస్తామని, డైట్ కాంట్రాక్టర్స్ బకాయిలను విడుదల చేస్తామని మంత్రి హామీనిచ్చారు. కరో నా రోగులకు పౌష్టికాహారం అందిచాలని కోరారు. అన్ని జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలను మొదలు పెట్టాలన్నారు. శానిటేషన్, పేషంట్ కేర్ ప్రొవైడర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్‌లో అవసరమైన సిబ్బందిని ప్రభు త్వ అనుమతితో నియమించుకోవాలని సూచించారు. అన్ని ఆసుపత్రులకు ఆక్సిజేన్ సిలిండర్లను హైదరాబాద్ నుంచే పంపిస్తామన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడకుండా జాగ్రత్త చూసుకోవాలన్నారు. డా క్టర్లకు ఎవరికైనా వైరస్ సోకితే వారిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని తెలిపారు. సీజనల్ వ్యాదులు ప్రబలుతున్నాయని, ఏజన్సీ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.
సామాజిక వ్యాప్తి అంశంపై చర్చ : సామాజిక వ్యాప్తి అంశం మీడియాలో వైరల్ కావడంతో దీనిపై మంత్రి ఈటల ఆరా తీసినట్టు సమాచా రం. సామజిక వ్యాప్తి ఎవరు ప్రకటించారనే విషయమై మంత్రి వైద్యాధికారులను ప్రశ్నించగా కొన్ని ప్రాంతాలలో వ్యాప్తి చెందిదని చెప్పామే తప్ప సామాజిక వ్యాపి జరుగుతుందనలేదని అధికారులు సమాధానమిచ్చినట్టు తెలిసింది.
వ్యాక్సిన్ వచ్చినాప్రయోజనం ఉండకపోవచ్చు
RELATED ARTICLES