కరోనాతో కొత్తగా ఆరుగురు మృతి
ప్రజాపక్షం/హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఖతర్నాక్‌గా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,284 కొవిడ్ 19 కేసులు నమోదవగా, కొత్తగా ఆరుగురు కరోనాకు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 409కి చేరింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శనివారం 667 కేసులు నమోదుకాగా, కరీంనగర్ జిల్లాలో 58 కేసులు, నల్లగొండలో 46 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 68, మేడ్చల్ జిల్లాలో 62 కేసులు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 36 కేసులు, మెదక్ జిల్లాలో 15, సిద్దిపేట జిల్లాలో 22, వికారాబాద్ జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా, ఖమ్మంలో 10, కామారెడ్డిలో 2 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 37 కేసులు, సూర్యాపేటలో 23, జనగామ జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 26 కేసులు, రాజన్న సిరిసిల్లలో 2 కేసులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4 కేసులు, జోగులాంబ గద్వాల 14 కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1 కేసు, మంచిర్యాలలో 19 కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లిలో 14, యాదాద్రి భువనగిరిలో 10, నారాయణపేటలో 14, ఆసిఫాబాద్‌లో నిర్మల్‌లో 1, వనపర్తి జిల్లాలో 24, ఆదిలాబాద్‌లో 8, జగిత్యాలలో 1, వరంగల్ రూరల్‌లో 5 కేసులు రికార్డయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 43,780కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 12,765 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 30,607 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. శనివారంనాడు ఒకేరోజు 1,902 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 14,883 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, ఇప్పటివరకు మొత్తం 2,52,700 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇంకా 15,169 బెడ్లు ఖాళీగా వున్నాయని తెలిపింది. గాంధీ ఆసుపత్రిలో ఇంకా 1890 బెడ్లు ఖాళీగా వున్నాయనితెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 61 కొవిడ్ ఆసుపత్రులు నడుస్తున్నాయని, వాటిలో 471 వెంటీలేటర్లు అందుబాటులో వున్నాయని వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్త కేసులు1,284
RELATED ARTICLES