24 గంటల్లో 1269 కేసులు
మరో 8 మంది మృతి
గ్రేటర్, పరిసర ప్రాంతాలను వణికిస్తున్న కరోనా
ప్రజాపక్షం/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. 24 గంటల్లో 1269 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 800, రంగారెడ్డిలో 132, మేడ్చల్ జిల్లాలో 64 కేసులు ఉన్నాయి. మరో 8 మంది కరోనాతో మరణించారు. ఒక రోజులో 8153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో 1269 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు మొత్తంగా 1,70,324 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో పాజిటివ్ సంఖ్య 34,671కు చేరింది. ఇప్పటివరకు 356 మంది మరణించారు. ప్రస్తుతం ఐసోలేషన్ బెడ్స్ 11,928 ఉండగా ఇందులో 843 మంది పేషంట్లు ఉన్నారని, ఆక్సిజన్ బెడ్స్ 3537లో 611 పేషంట్లు, ఐసియు బెడ్స్ 1616లో 260 మంది, మొత్తం 17,081 బెడ్సెలలో 1714 మంది పేషంట్లు ఉన్నారని, మిగిలిన 15,367 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. అలాగే కరోనా గాంధీ ఆస్పత్రిలో మొత్తం 1890 బెడ్స్‌లలో ఐసియులో 122, ఆక్సిజన్ బెడ్స్‌లో 438, వార్డులలో 238, మిగతా 798 మొత్తం 1092 మంది ఉన్నారని వివరించింది. మొత్తం 1269 పాజిటివ్ కేసులలో జిహెచ్‌ఎంసిలో 800, రంగారెడ్డిలో 132, మేడ్చల్‌లో 94, సంగారెడ్డిలో 36, కరీంనగర్, నాగర్‌కర్నూల్ 23 చొప్పున కేసులు నమోదు కాగా,మహబూబ్‌నగర్‌లో 17, వనపర్తి, నల్లగొండలో 15 చొప్పున కేసులు ఉన్నాయి. మెదక్‌లో 14, వరంగల్ అర్బన్‌లో 12, రూరల్‌లో 2, నిజామాబాద్‌లో 11, జనగాం, వికారాబాద్ జిల్లాల్లో 6 చొప్పున కేసులు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్లా, సిద్దిపేటలో మూడేసి కేసులు నమోదు అయ్యాయి. యాదాద్రి, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో ఏడు, నిర్మల్, జగిత్యాలలో 4 చొప్పున కేసులు నమోదు కాగా ఖమ్మంలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయింది.
తగ్గని కేసులు
RELATED ARTICLES