సోమవారం నుండి వారం విడిచి వారం డ్యూటీ
అపాయింట్‌మెంట్ లేనిదే సచివాలయంలో నో ఎంట్రీ
జులై 4వ తేదీ వరకు అమలు
‘కొవిడ్-19’ మార్గదర్శకాలను విడుదల చేసిన సోమేశ్‌కుమార్
ప్రజాపక్షం/హైదరాబాద్ కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సగం సిబ్బందితో పని చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలలో సిబ్బంది వారం విడిచి వారం పద్ధతిన పని చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం మార్గదర్శకాలను విడుదల చేశారు. మార్గదర్శకాల్లో పొందుపర్చిన నిబంధనలు సోమవారం నుండి అమలులోనికి రానున్నాయి. సచివాలయంతో పాటు పలు శాఖలలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుం ది. సబార్డినెట్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇతర నాల్గవ తరగతి ఉద్యోగులు వారం విడిచి వారం 50 శాతం పద్ధతిన పనిచేయాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, క్లరికల్ స్టాఫ్, ఆఫిస్ సబార్డినెట్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, నాల్గవ తరగతి ఉద్యోగులు కూడా ఇదే పద్ధతిని పాటించాల్సి ఉండగా, అధికారులు మాత్రం ప్రత్యేక చాంబర్లలో ఉంటూ రోజువారి తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు జులై 4వ తేదీ వరకు అమలులో ఉంటాయి.
మీరు సెలవులు తీసుకోండి కరోనా వైరస్ సోకేందుకు అవకాశం ఉన్న గర్భిణులు, ఇతర వ్యాధులు ఉన్న వారు సెలవు తీసుకుని ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు తమకు అవకాశమున్న క్యాజువల్ లీవ్, ఆర్జిత సెలవులు, ఆఫ్ పే లీవ్‌లను వాడుకోవాలని, దీనికి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్‌ను పొందుపర్చాలని మార్గదర్శకాల్లో పొందుపర్చారు. కాగా సెలవులు తీసుకున్న వారు తమ ఇంట్లోనే ఉండాలని, ఎప్పుడైనా ఏమైనా అత్యవసర సందర్భంలో పిలిస్తే అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సూచించింది.
మార్గదర్శకాలు ఇవే ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకులను అనుమించబోరు. సంబంధిత అధికారి అనుమతి ఉన్న వారు మినహా ఎవ్వరూ రాకూడదు.
F లిఫ్ట్‌లో ముగ్గురికి మాత్రమే అనుమతించాలి.
F ఉద్యోగులు సాధ్యమైనంత వరకు తమ గృహాల నుండే భోజనాలను తెచ్చుకోవాలి. భోజన విరామ సమయంలో కూడా ఉద్యోగులు భౌతిక దూరాన్ని పాటించాలి.
F పార్కింగ్ ప్రాంతంలో డ్రైవర్లందరూ గుమికూడొద్దు. ఎవరి పేషీలో వారే ఉండాలి.
F అధికారుల చాంబర్లలో ఎసిలను వాడుకూడదు. చాంబర్‌లోకి వెళ్తురు వచ్చేలా కిటికీలను తెర్చుకోవాలి.
F ఉద్యోగులు నిరంతరం చేతులను శుభ్రంగా కడుక్కోవడం/శానిటైజర్‌ను ఉపయోగించడం, మాస్కులను ధరించాలి
సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో సగం మందే…
RELATED ARTICLES