దేశంలో అత్యధికంగా 9996 కరోనా పాజిటివ్ కేసులు
తాజాగా 357 మంది మృతి.. 8,102కి చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్‌లో ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9996 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ బారినపడి 357 మంది మృతిచెందారు. గడిచిన వారం రోజులుగా దేశంలో నిత్యం దాదాపు పదివేల కేసులతో పాటు 250కిపైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ బయటపడిన అనంతరం 24 గంటల్లో 357 మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 8,102కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచంలో రోజువారీ నమోదవుతున్న కేసులు చూసినా అత్యధికంగా భారత్‌లోనే బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో అత్యధికంగా 9996 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు 2,86,579 మంది కరోనాబారిన పడినట్లు ప్రభు త్వం వెల్లడించింది. వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,41,029మంది కోలుకోగా మరో 1,37,448మంది బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపింది.
ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ కెనడాను దాటింది. ఇప్పటివరకు 12వ స్థానంలో ఉన్న భారత్ తాజా మరణాలతో ప్రపంచంలో 11వ స్థానానికి చేరింది. ఇక అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఐదవస్థానంలో ఉంది. తాజా కేసులతో నాల్గవ స్థానంలో ఉన్న బ్రిటన్‌కి చేరువైంది.
ఉగ్రరూపం
RELATED ARTICLES