న్యూఢిల్లీ : కరోనా వైరస్ వల్ల దేశంలో 50 రోజులుగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా అవాంఛిత గర్భాల సంఖ్య పెరుగుతుందని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వేతర సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌వల్ల తాత్కాలికంగా కుటుంబ నియంత్రణ సాధనాలు, కుటుంబ నియంత్రణకు సంబంధించిన శస్త్రకిత్సలు, గర్భందాల్చకుండా ముందుగా వేసుకునే మాత్రలు అందుబాటులో లేకపోవడంవల్ల ఊహించని రీతిలో దేశంలో సురక్షితంకాని వెల్లువలా గర్భస్రావా లు, గర్భిణీ స్త్రీల మరణాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత పునరుత్పత్తి ఆరోగ్యసేవల సంస్థ (ఫౌండేషన్ ఫర్ రీప్రొడక్టివ్ హెల్త్ సర్వీసెస్-(ఎఫ్ఆర్హెచ్ఎస్)) నిర్వహించిన ఒక విశ్లేషణలో ఈ హెచ్చరిక చేసింది. 2 కోట్ల 56 లక్షల మంది దంపతులకు కుటుంబ నియంత్రణ సాధనాలు ఈ లాక్డౌన్ సమయంలో అందుబాటులో లేకపోవడంవల్ల అవాంఛిత గర్భాలు వచ్చే అవకాశం ఉందని ఎఫ్ఆర్హెచ్ఎస్ పేర్కొంది. దేశంలో సెప్టెంబరు నాటి వరకు తిరిగి సాధారణ పరిస్థితులు నెలకునేదాకా, 6.90 లక్షల స్టెరిలైజేషన్ సేవలు, 9.70 లక్షల ఐయుసిడి (ఇంట్రా యుటెరిన్ కంట్రాసెప్టివ్ డెవైజస్)లు, మరో 40.39 కోట్ల కండోమ్స్, ఇతర సాధనాల కొరత ఏర్పడటంవల్ల దేశంలో మరో 23 లక్షల మంది స్త్రీలకు అనుకోని విధంగా అవాంఛిత గర్భాలు వచ్చే ప్రమాదం ఉందని, 6.79 లక్షల జననాలు సంభవించే అవకాశం ఉందనీ, 14 లక్షల 50 వేల మంది స్త్రీలకు గర్భస్రావాలు కలిగే పరిస్థితులున్నాయనీ, ఇం దులో, 8.34 లక్షల మంది స్త్రీలకు ఏ మాత్రం రక్షణలేని గర్భస్రావాలు జరుగుతాయనీ. 1,743 మంది పురిటిలోనే మరణించే అవకాశాలుంటాయనీ ఎఫ్ఆర్హెచ్ఎస్ పేర్కొంది. లాక్డౌన్ గనుక పొడిస్తూ వెళితే ఇలాంటి పరిస్థితులు, ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా విశ్లేషణ వెల్లడించింది. హాస్పిటల్స్‌లో ఔట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది, కమ్యూనిటీ హెల్త్ కేర్ అడుగంటిపోయింది, ప్రైవేటు హాస్పిటల్స్ జనరల్ మెడిసిన్స్ ఔట్ పేషెంట్లకు సమకూర్చడం మానేశాయి, కెమిస్ట్ దుకాణాలు తెరిచి ఉన్నప్పటికీ ఆంక్షలవల్ల, కోరుకున్న సాధనాలు అందుబాటులో లేకపోవడంవల్ల, దగ్గరలో ఉన్న దుకాణాల నుంచి కుటుంబ నియంత్రణ సాధనాలు కొనుగోలు చేయడానికి చాలామంది ఇష్టపడకపోవడం, ఎక్కువదూరం వెళ్ళి కొనుగోలు చేయడానికి జోన్లవారీగా పోలీసు అంక్షలు ఉండటంవల్ల చాలామంది రాజీపడిపోవడం, సరైన సమయానికి స్త్రీలకు ఇందుకు సంబంధించిన సహాయం, మందులు లభించకపోవడం కూడా ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఈ కారణంగా ‘కామసూత్ర’ బ్రాండ్ కండోమ్స్ విక్రయాలు దేశీయ మార్కెట్లో మార్చి నెలలో 50 శాతం, ఏప్రిల్ నెలలో 60 శాతం తగ్గిపోయినట్టు ఆ బ్రాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధీర్ లంగర్ చెప్పారు. అందువల్ల కండోమ్స్‌ను కూడా నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చాలని ఆయన కోరుతున్నారు. అయితే పోలీసులు ఇందుకు ఒప్పుకోకపోవడంవల్ల తమ గోదాముల్లో స్టాకు నిల్వలు ఉండిపోతున్నాయని ఆయన అన్నారు. కుటుంబ నియంత్రణ సేవలు కుటుంబాలకు అందుబాటులో లేకపోవడానికి శిశు జననాలకు సంబంధించి ఉమెన్ ఏజన్సీల కొరత కూడా ఒక కారణమని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కార్యనిర్వహణా సంచాలకురాలు పూనమ్ ముత్రేజా అన్నారు.
అవాంఛిత గర్భం… ఓ హెచ్చరిక!
RELATED ARTICLES