ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో శ్రామిక హక్కులపై వేటు
కొత్త ఆర్డినెన్స్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎఐటియుసి, ప్రతిపక్షాలు డిమాండ్
న్యూఢిల్లీ : దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో కార్మిక హక్కులపై వేటు పడింది. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఏకంగా కార్మిక చట్టాలనే రద్దు చేశారు. కరోనా విపత్తును అడ్డం పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వ అండ చూసుకొని, ఈ మూడు రాష్ట్రాల్లో కార్మికుల గొంతును తడిగుడ్డతో కోశారు. ప్రధానంగా కాషాయవస్త్రధారి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ పేరు ‘ఉత్తరప్రదేశ్ టెంపరరీ ఎగ్జంప్షన్ ఫర్ సెర్టయిన్ లేబర్ లాస్ ఆర్డినెన్స్ 2020. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దీన్ని పునరుజ్జీవింపజేసేందుకు ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశామని చెప్పుకుంది. ఈ ఒక్క ఆర్దినెన్స్‌తో ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 38 కార్మిక చట్టాలు రద్దయ్యా యి. 1000 రోజులపాటు అంటే దాదాపు 3 సంవత్సరాలపాటు ఈ కార్మిక చట్టాలు రద్దులో వుంటాయని ఆర్డినెన్స్ స్పష్టం చేసింది. రద్దయిన చట్టాల్లో పారిశ్రామిక వివాదాల చట్టం, వృత్తిభద్రత, ఆరోగ్య చట్టం, కాంట్రాక్టు కార్మికుల చట్టం, వలస కార్మిక చట్టం, సమాన వేతన చట్టం వంటి చట్టాలు వున్నాయి. ఈ వెయ్యి రోజుల కాలంలో కేవలం భవన నిర్మాణ కార్మికుల చట్టం, నష్టపరిహార చట్టం (1923), వెట్టి కార్మిక చట్టం (1976), అలాగే వేతన చెల్లింపుల చట్టం (1934)లోని సెక్షన్ 5 మాత్రమే అమల్లో వుంటాయి. ఇంత దారుణంగా చట్టాలను రద్దు చేయడం బ్రిటిష్‌పాలనలో మాత్రమే జరిగింది. ఇక మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కూడా అనూహ్యమైన రీతిలో ఫ్యాక్టరీల చట్టం, ఒప్పంద కార్మికుల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టంలో సమూల మార్పులు చేసింది. ఈ మార్పులు ఎలాంటివంటే, కార్మికుడు ఇక మాట్లాడటానికి అవకాశం వుండదు. యజమానులు వారికి ఇష్టమొచ్చినప్పుడు, ఇష్టమొచ్చిన రీతిలో కార్మికులను తొలగించుకోవచ్చు. వివాదాన్ని లేవనెత్తే హక్కు కూడా లేదు. 49 మంది కార్మికుల సంఖ్య వరకు కార్మికులను సరఫరా చేయడానికి కాంట్రాక్టర్లకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి తనిఖీలు చేయకూడదు. ఇదంతా మధ్యప్రదేశ్‌లో పరిస్థితి. ఇక గుజరాత్ ప్రభుత్వం కార్మికుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నది. 8 గం టల పనిదినాన్ని ఏకంగా 12 గంటలకు పెంచేసింది. అయితే పనిచేసే అదనపు గంటలకు ఎలాంటి అదనపు వేతన చెల్లింపులు వుండవు. ఇక యుపి, మధ్యప్రదేశ్‌లలో కూడా పనిగంటలను నిర్ధారించే అధికారాన్ని పూర్తిగా యా జమాన్యాలకు అప్పగిస్తూ ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేశాయి.
1000 రోజులు కార్మిక చట్టాలు రద్దు
RELATED ARTICLES