HomeOpinionArticlesచితికిన చేనేత

చితికిన చేనేత

లాక్‌డౌన్‌తో కార్మికుల దీనస్థితి

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కరోనా.. అన్ని రకాల చేతి వృత్తులను దెబ్బతీసింది. కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి చేనే త, కల్లుగీత ఒకటేమిటి అన్ని రకాల వృత్తులు కునారిల్లి పోయాయి. అగ్గిపెట్టేలో ఇమిడే చీరలను ఉత్పత్తి చేసిన చేనేత కార్మికులకు ఇప్పుడు అత్యంత దుర్భర పరిస్థితులే నెలకొన్నాయి.  తెలంగాణలో విద్యుత్‌ కోతలు లేకపోవడంతో చేనేత, టెక్స్‌టైల్స్‌ రంగం  గతంలో కంటే కూడా బాగా పుంజుకుంటుందని అందరూ భావించా రు. చేనేత వస్త్ర ఉత్పత్తులకు కావాల్సిన దారాలు, ఇతర ముడి సరుకులు రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  అలాగే చేనేత, టెక్స్‌టైల్స్‌ రంగాలకు వేరు వేరుగా పాలసీలను రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా 6 వేల మందికి మహాత్మాగాంధీ బునకర్‌ బీమా యోజనను కల్పించింది. ఈ బీమాకు కొన్ని షరతులు ఉన్నాయి. చేనేత కార్మికుడి వయస్సు 59 ఏళ్లకు మించరాదన్న నిబంధన విధించింది. 59 ఏళ్ల అనంతరం ఆ చేనేత కార్మికుడు చనిపోతే బీమా వర్తించదు. కార్మికుడు చెల్లించిన ప్రీమియం డబ్బులు కూడా చల్లించరు. చని పోయిన తర్వాత ఆదుకోవడం కంటే.. ఈ లాక్‌డౌన్‌ సంక్షోభం నేపథ్యంలో ఆత్మహత్యలు, ఆకలిచావులకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని చేనేత కార్మికులు, సంఘాలు అంటున్నాయి. చేనేత రంగంపై రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఆరు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. తెలంగాణలో చేనేత, మర మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య 10 లక్షల పైగానే ఉంది. ప్రస్తుత లాక్‌డౌన్‌తో చేనేత కార్మికుల పరిస్థితి మూలిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా మారింది. రవాణా, వస్త్రాల ఉత్పత్తులకు కావాల్సిన ముడిసరుకులు ఇతర  రాష్ట్రాలు, దేశాల నుండి  రాకుండా  నిలిచి పోవండం ఒకటైతే ..  ఉన్న ముడి సరుకులతో ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలకు  మార్కెటింగ్‌ లేక పోవడం, విక్రయాలూ పూర్తిగా నిలిచి పోవడం మరో కారణం అవుతోంది. దీంతో మగ్గాలనే నమ్ముకుని బతుకులు ఈడుస్తున్న నేత కార్మికులకు తిండి కూడా కరువై పోతోంది. ఈ పరిస్థితుల్లో కుటుంబాలకు ఎలా పోషించుకోవాలో తెలియని అయోమయస్థితిలో ఉన్నారు. చేనేత వస్త్ర ఉత్పత్తికి భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి పని చేస్తేగానీ వారికి కూలీ కూడా గిట్టని పరిస్థితి నెలకొంటోంది. పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట వంటి ప్రాంతాలు తెలంగాణలోనూ,  గుంటూరు, విశాఖపట్నం, తాడేపల్లి, మంగళగిరి వంటి ప్రాంతాలు  ఆంధ్రప్రదేశ్‌లో చేనేత వస్త్ర ఉత్పిత్తి రంగంలో ఉన్నాయి. తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చి 31 రోజులు గడిచింది. ఈ లాక్‌డౌన్‌ నెల రోజులుగా పనులు ఆగి పోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన  సడలింపులూ రాష్ట్రంలో అమలు కావడం లేదు. కరోనా కేసులు పెరుగుతుండడంతోనే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 7 వరకు పొడిగించింది. మే 5న మరోసారి  సమీక్షించుకుని లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్‌ చెప్పడంతో లాక్‌డౌన్‌  ఎప్పటి వరకు కొనసాగనుందో? అన్న సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. లాక్‌డౌన్‌ మినహాయించినా రోజంతా కష్టపడి పని చేస్తే రెండు వందలు కూడా రాని పరిస్థితి ఉంటుందని చేనేత కార్మికులు పేర్కొంటున్నారు. ఒక చీర తయారీకి ఎంత లేదనుకున్నా పది రోజులైనా పడుతుందని, దీనికి నలుగురు పని చేయాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. మగ్గాలకు కావాల్సిన ముడి సరుకులు కొనిపించాలని, అలాగే చేనేత, డయ్యింగ్‌ కార్మికులందరికీ తగినన్ని రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments