వైరస్ ఉన్నా కనబడని రియాక్షన్
శరీరంలో వైరస్ సంఖ్య వందలు లేదా వేలల్లోనే ప్రవేశించి ఉండొచ్చని అంచనా
దాదాపు పది రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 65 శాతం ఎసింప్టమేటిక్ కేసులే!
క్రమంగా పెరుగుతున్న ఎసింప్టమేటిక్ కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా మహమ్మారి రాష్ట్రాలను కలవరపెడుతోం ది. క్రమంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎసింప్టమేటిక్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచదేశాల్లో ఉన్నట్టుగా ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే ఈ కేసులు కనిపిస్తున్నాయంటున్నారు. తాజాగా వెలుగుచూస్తున్న పాజిటివ్ కేసుల్లో కొన్ని వరకు ఎసింప్టమేటిక్ వారేనని వైద్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు వైరస్ లక్షణాలు బయటపడని వారివేనని తేలుతుండడం కలవరం రేపుతోంది. లాక్డౌన్ విధించి నెలరోజులు కావస్తున్నా కేసుల సంఖ్య తగ్గకపోగా తెలుగు రాష్ట్రాలతోపాటు అసోం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఇతర కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో 186 కేసులు ఎసింప్టమేటిక్కేనని తెలిసింది. హ ర్యానాలోనూ ఈ తరహా కేసులే ఎక్కువగా ఉన్నా యి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఈ కేసు లు బయటపడుతున్నాయి. అసలు కరోనా ఎప్పుడు ఎలా సోకిందో కూడా కొందరి విషయం లో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొన్ని సర్వేల ప్రకారం, తాజా లెక్కల ప్రకారం ఒక వ్యక్తి మరో 400 మందికి కరోనా వైరస్‌ను చేరవేయగలుగుతున్నట్లు తెలుస్తోంది. వైరస్ సోకితే ఇదివరకు 14 రోజుల తర్వాత కానీ లక్షణాలు బయటపడేవి కావు. కానీ ఇప్పుడు రోజులు గడుస్తున్నా సరి గా తెలియడం లేదు. కొద్దిగా బయటపడ్డ వారిని పరీక్షిస్తే పాజిటివ్‌గా నమోదవుతున్నాయని ఓ అధ్యయనంలో తేలినట్లు సమాచారం. ఇది ప్రమాదకర సంకేతంగా డాక్టర్లు భావిస్తున్నారు. దేశంలోని పది
రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 65 శాతం ఎసింప్టమేటిక్ కేసులేనని కొందరు నిపుణులు తమ అభిప్రాయం చెబుతున్నారు. ఈ తరహా కేసుల వల్ల కరోనా వైరస్ చాపకింద నీరులా ఇతరులకు చేరిపోయే అవకాశం ఉంది. వైరస్ బారిన పడ్డామన్న విషయం ఆ బాధితులకు కూడా తెలియదు. ఈ మధ్య వారు ఎవరిని కలిసినా కరోనా బారిన పడే అవకాశాలుంటాయి. ఈ వైరస్‌తో వచ్చిన సమస్యే ఇది అని వైద్యులు అంటున్నారు. వీలైనంత త్వరగా అలాంటి కేసులను గుర్తించి వారిని ఐసోలేట్ చెయ్యాల్సిన అవసరం ఉందని కొందరు డాక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.
పది రాష్ట్రాల్లో అలాంటి కేసులేనంటా…!
ఓ సంస్థ జిరిపిన విశ్లేషనలో సుమారు 10 రాష్ట్రాల్లో ఎసింప్టమేటిక్ కేసులే నమోదవుతున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో మొత్తం పాటిజివ్ కేసుల్లో 65 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 75 శాతం ఎసింప్టమేటిక్ కేసులుగానే ఉన్నాయని పేర్కొన్నది. ఈ కేసుల్లో వ్యక్తులను టెస్టింగ్ చేసినప్పుడు కరోనా నెగెటివ్ అనే వచ్చింది. తీరా కొన్ని రోజుల తర్వాత వారికి కరోనా ఎప్పుడో సోకిందనే విషయం వెలుగుచూసింది. అసోంలో 82 శాతం కేసులు ఎసింప్టమేటిక్కేనని తేలింది. ఆ కేసుల్లో వారికి టెస్టింగ్ జరిపినప్పుడు దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం ఇలాంటి లక్షణాలు ఒక్కటీ కనిపించలేదని తెలిసింది. ఢిల్లీలో 186 కేసులు ఎసింప్టమేటిక్కేనినీ, హర్యానాలోనూ ఈ తరహా కేసులే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఈ కేసులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. అసలు కరోనా ఎప్పుడు ఎలా సోకిందో కూడా కొందరి విషయంలో అర్థం కాని పరిస్థితి. తాజా లెక్కల ప్రకారం ఒక వ్యక్తి మరో 400 మందికి కరోనా వైరస్‌ను చేరవేయగలుగుతున్నట్లు తెలిసింది. అంటే ఎసింప్టమేటిక్ కేసుల వల్ల కరోనా చాలా మందికి వ్యాపించే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. శరీరంలో… సంబంధం లేనిది ఏది ప్రవేశించినా వెంటనే రియాక్షన్ మొదలవుతుంది. అలాగే కరోనా వైరస్ బాడీలోకి ప్రవేశిస్తే వెంటనే జ్వరంతోపాటు జలుబు, దగ్గు వంటి లక్షణాలు బయటపడాలి. లేదంటే ఆ వైరస్‌ను తరిమేందుకు మన బాడీలో మంచి బ్యాక్టీరియా పోరాడాలి. కానీ చాలా కేసుల్లో అలా జరగట్లేదని తెలుస్తోంది. 14 రోజుల పాటు వైరస్ బాడీలోనే ఉన్నా రియాక్షన్ రావట్లేదనే కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే విషయం ప్రభుత్వాన్ని, డాక్టర్లను కలవరపెడుతోంది. ఇండియాలో చాలా మంది ఎసింప్టమేటిక్ అవ్వడానికి ఓ బలమైన కారణం ఉంది. వారిలోకి ప్రపేశించే వైరస్ సంఖ్య వందలు లేదా వేలల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టే కొంతమందిలో లక్షణాలు కనబడట్లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే వైరస్ లక్షల్లో శరీరంలోకి ప్రవేశిస్తే అప్పుడు వెంటనే లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ కోణంలో చూస్తే మన దేశంలో చాలా మందికి కరోనా వైరస్ అంతంతమాత్రంగానే బాడీలోకి చేరుతోందని అనుకోవచ్చని మేధావులు, నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క లాక్డౌన్ పూర్తయ్యేంతవరకూ ప్రజలు ఎవ్వరూ బయటి రాకూడదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.