ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 872కి పెరిగింది. కొత్త గా సోమవారం నాడు 14 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇద్దరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 23కి పెరిగింది. ప్రస్తుతం 663 మంది చికిత్స పొందుతుండగా, 186 మంది డిశ్చార్జి అయ్యారు. సోమవారంనాడు జిహెచ్ఎంసి పరిధిలో 12 కేసులు నమోదుకాగా, నిజామాబాద్, మేడ్చల్లలో చెరొక కేసు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో ఈ విషయం వెల్లడించింది. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని, ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు సహకరించాలని కోరింది. ఎంతో అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది.
తెలంగాణలో 872కి పెరిగిన కరోనా కేసులు
RELATED ARTICLES