సేవించే వారికి కేంద్రం షాకింగ్ న్యూస్
ప్రజాపక్షం / హైదరాబాద్ : మద్యం సేవించే వారికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రాలలో మద్యానికి సంబంధించి చాలా వరకు వార్తలు వస్తున్నాయని, మద్యం దుకాణాలు తెరిస్తే వైరస్ వ్యాప్తి వేగవంతమవుతుందన్న సూచన వుంద ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ఈనెల 20వ తేదీ తర్వాత దేశంలో లాక్‌డౌన్ అమలులో కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నప్పటికీ మద్యం దుకాణాలు తెరిచే అవకాశం లేదని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా గ్రీన్ జోన్ల లో పలు ఆంక్షలను తొలగించనున్నట్లు వెల్లడించారు. లాక్‌డౌన్ కొనసాగింపు, కరోనా నియంత్రణ, ఈ రెండు అంశాలను వేరువేరు గా చూడవద్దని ఆయన సూచించారు. కేంద్ర హోం శాఖ నేతృత్వంలో 24 గంటలు అన్ని రాష్ట్రాలతో నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నామని కిషన్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. రైతులు, హాస్పిటల్, వ్యవసాయోత్పత్తుల రవా ణా, వలస కూలీలు, హెల్త్ ట్రీట్మెంట్ వంటి వాటిపై కేంద్రానికి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన వివరించారు. ఈనెల 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వబోతున్నామని ఆయన మరోసారి చెప్పారు. రాష్ట్రాలలో గ్రీన్ జోన్లుగా ఉన్నటు వంటి ప్రాంతాలలో కొన్ని దుకాణాలు, నిర్మాణ పనులు వంటివి చేసుకోవడానికి సడలింపులు ఇస్తున్నట్లు చెప్పారు. నరేగా పనులు కూడా కొనసాగుతాయన్నారు. “ఈనెల 20 తర్వాత ఇవ్వనున్న సడలింపులో మద్యం దుకాణాలు తెరుచుకోవు. రోగ నిరోధక శక్తిని చంపేసేలా మద్యం పని చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సడలింపు ఇవ్వదు. మద్యం అమ్మకూడదని ఇప్పటికే మార్గదర్శకాలలో పొందుపర్చాం. కానీ కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్లో మద్యం అమ్మకాలు జరపాలని చూస్తున్నాయి. అది రాష్ట్రాల ఇష్టం ” అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో ఇంకా కొన్ని చోట్ల డాక్టర్ల మీద, వైద్య సిబ్బంది మీద దాడులు జరుగుతున్నాయని, ఇది సిగ్గుచేటని ఆయన అన్నారు. డాక్టర్లు చనిపోతున్నా కూడా ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడుకున్నారని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై వుందని కిషన్‌రెడ్డి సూచించారు. “వాళ్ల మీద దాడి చేయడం సమాజం సిగ్గు పడే అంశం. ప్రపంచంలో ఎక్కడ కూడా డాక్టర్ల మీద దాడులు జరగడం లేదు. డాక్టర్ల మీద దాడులు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాం. వలస కూలీలు ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వలు ఏర్పాటు చేయాలి” అని కిషన్ రెడ్డి అన్నారు.