అంబేద్కర్‌వాదుల అరెస్టుపై సురవరం
ప్రజాపక్షం/హైదరాబాద్ : బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 129వ జయంతి రోజునే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న ఆయన మనుమడు ఆనంద్ తేల్‌తుంబ్డే, గౌతమ్ నవ్‌లఖా వంటి మానవ హక్కుల కార్యకర్తలను అరెస్టు చేయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోవైపు అంబేద్కర్‌కు నివాళులర్పించడం విచిత్రంగా వుందని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన బుధవారంనాడు ట్వీట్ చేస్తూ, కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభంతో దేశం గందరగోళంలో ఉన్న సమయంలోనూ, మోడీ ప్రభుత్వం… సిఎఎ నిరసనల్లో సర్కారు అబద్దాలను ఎండగట్టిన వారిపై తప్పుడు చర్యలకు పాల్పడటంపైనే దృష్టిపెట్టిందని సురవరం దుయ్యబట్టారు.