HomeNewsBreaking Newsకొండపోచమ్మ రిజర్వాయర్‌పై మధ్యంతర ఉత్తర్వులు

కొండపోచమ్మ రిజర్వాయర్‌పై మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌ :తాము తిరిగి ఉత్తర్వులిచ్చే వరకూ కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి నీటితో మామిడ్యాల, బహిలాంపూర్‌ గ్రామాల్ని ముంపు జరిగే చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్కార్‌ను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ల డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఆ రెండు గ్రామాలకు చెందని 50 మందికిపైగా రైతులు వేసిన రిట్లను బెంచ్‌ విచారించి మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రైతుల హక్కులను కోర్టు పరిష్కరిస్తుందని, చట్ట ప్రకారం రిట్లను విచారించి తగిన ఉత్తర్వులు ఇస్తామని, ఈలోగా రిజర్వాయర్‌ నీటితో రెండు గ్రామాలు ముంపు అయ్యేలా చేయవద్దని స్పష్టం చేసింది. రిట్లు వేసినవారంతా పొలిటికల్‌ పార్టీకి చెందినవారని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్నారు. వెయ్యి మంది ఖాళీ చేశారని, వీరంతా ప్రాజెక్టును అడ్డుకునే క్రమంలోనే కోర్టును ఆశ్రయించారని చెప్పారు. రైతులకు సహాయ, పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని ఒత్తిళ్లు తెస్తున్నారని రైతుల లాయర్‌ చెప్పారు. దీనిపై హైకోర్టు.. కరోనా ఉండగా హడావుడిగా పనులు చేయాల్సిన అగత్యం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్‌ వేయాలని సర్కార్‌ను ఆదేశించిన బెంచ్‌ విచారణను 13కి వాయిదా వేసింది. ఈలోగా ఆరెండు గ్రామాల్ని ముంపు జరిగేలా ఎటువంటి చర్యలు తీసుకోరాదని సర్కార్‌ను ఆదేశించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments