సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
సిపిఐ ఆధ్వర్యంలో పేద కూలీలకు, వలస కార్మికులకు బియ్యం, కూరగాయల పంపిణీ
ప్రజాపక్షం / హైదరాబాద్ : కరోనా కల్లోలంతో ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారని, ఆపత్కాలంలో ఆకలి తీర్చడానికి కమ్యూనిస్టులు ముందుండాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జవహర్‌నగర్‌లో సిపిఐ ఆధ్వర్యంలో పేద కూలీలకు, వలస కార్మికులకు బియ్యం, కూరగాయలను చాడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల మల్లేష్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా రక్కసితో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అలజడికి గు రవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్‌డౌ న్ ప్రకటించడంతో రోజు కూలీలు, ఇతర రాష్ట్రాల నుండి పనుల కోసం వలస వచ్చిన కూలీలను ఆదుకోడానికి కమ్యూనిస్టులు క్షేత్ర స్థాయిలో పట్టుదలతో కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వారికి బి య్యం సక్రమంగా అందించడం లేదని అన్నారు. రూ. 1500 అకౌంట్‌లో వేస్తామని చెప్పిన ప్రభుత్వం సక్రమం గా వేయడం లేదని ఈ విషయమై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రేషన్ కార్డులు లేని వారికి బి య్యం పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్. బాలమల్లేష్ మాట్లాడుతూ ప్రకృతి ప్రళయాలకు, వైరస్ రక్కసులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త లు కృషి చేయాలని కోరారు. కరోనాను కట్టడి చేయడాని కి వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. నర్సుల నియామకాలను శాశ్వత ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. బియ్యం పంపిణీ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డిజి సాయిలు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ దశరథ్, తోటపల్లి శంకర్, ఆర్. కృష్ణమూర్తి, కా ప్రా మండల సిపిఐ కార్యదర్శి నిమ్మల నర్సింహ్మా నాయకులు శ్రీనివాస్, డి.యాదగిరి, రాజేశ్వరి, ప్రవీణ్, ఎల్ల య్య, ఎస్‌కె మొహియుద్దీన్, సురేష్ పాల్గొన్నారు.
బ్యాంకు ఖాతాలు, రేషన్, రైతు సమస్యలు పరిష్కరించాలి
ప్రజాపక్షం / హైదరాబాద్ : జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాలు (ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన), రైషన్, రైతు సమస్యలు పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. దేశంలోని పేదలు ఎలాంటి చార్జీలు లేకుండా జిరో బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతాలు తెరుచుకోవాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని ప్రధాన బ్యాంకులు వేలాది మంది పేద ప్రజలకు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలు తెరిచాయని తెలిపారు. కాలక్రమేణా ఆయా బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలను సాధారణ ఖాతాలుగా మార్చారని, కరోనా వైరస్‌తో లాక్‌డౌన్ ప్రకటించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలిచిన ఆర్థిక సహాయం నెలకు రూ.500 చొప్పున మూడు నెలలు సాధారణ అకౌంట్లుగా మార్చబడిన వారు కోల్పోతున్నారని చాడ వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సాధారణ బ్యాంకు ఖాతాలను జీరో అకౌంట్లుగా మార్చి ఆ అకౌంట్లను కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా తెల్లరేషన్ కార్డులందరికీ వర్తింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రైతులు కూరగాయలు, ఇతర పంటలతో పాటు సుభాబుల్ తోటలు పెంచుతున్నారని వాటికి ఎరువులు, పురుగుమందులు ఉపయోగించాల్సి ఉందని తెలిపారు. తోటలకు నీరు పెట్టడానికి మోటర్లు ఉపయోగిస్తున్నారని కొన్ని సందర్భాలలో మోటర్లు చెడిపోతున్నాయని పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందుల షాపులు, ఆటో మొబైల్ షాపులు ప్రతిరోజు కొంత పరిమిత సమయంలో తెరిచి ఉంచుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, తదితర రాష్ట్రాల నుంచి వచ్చి వందల మంది సీలింగ్ వర్కర్స్ అనేక సంవత్సరాలుగా మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నారన్నారు. వీరికి రేషన్ కార్డులు లేవని, ప్రభుత్వ సహాయం అందడం లేదని తెలిపారు. వీరికి రేషన్ బియ్యంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యంతో పాటు ఒక కేజి పప్పు ఇస్తామని ప్రకటించిందని, ఎపిలో పప్పు పంపిణీ చేస్తున్నారని, మన రాష్ట్రంలో కందిపప్పు ఇవ్వడం లేదని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కందిపప్పు పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ జిల్లా రైతుల వద్ద నుండి ఆ జిల్లా రైస్ మిల్లర్లే కొనుగోలు చేసేటట్లు ప్రకటించాలన్నారు. ఒక జిల్లా రైస్ మిల్లులను ఇంకొక జిల్లా రైతులకు కేటాయించడంతో రవాణా, హమాలీ సమస్యలు ఏర్పడుతున్నాయని రైతులు సకాలంలో తమ ఉత్పత్తులను అమ్ముకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని చాడ వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
చేనేత కార్మికులను ఆదుకోండి
ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరించిన దరిమిలా దాని ప్రభావ అన్ని రంగాలతో పాటు చేనేత రంగం మీద కూడా పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇ లాంటి విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు పని ఇచ్చే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగులు, రసాయనాలు, నూలు, ముడిసరుకుల అధిక ధరల మూలంగా ఇంతకు ముందే చేనేత పరిశ్రమ కుదేలై ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడు మూలిగే నక్కపై తాటి పండు అన్న సం దంగా కరోనా మూలంగా నూలు, రంగు, రసాయనాల రవాణా స్తంభించి పోయిందన్నారు. మాస్టర్ రివర్స్, సహకార సంఘాల వద్ద వస్త్ర నిల్వలు పేరు కు పోయాయని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎంతో కొంత పని ఇచ్చే వారి వద్ద ఉత్పత్తులు పేరుకుపోవడం మూలంగా కార్మికులు పనిలేకుండా అల్లాడుతునానరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూలు సబ్సిడీ అనేక షరతుల కారణంగా కార్మికులందరికీ అందడం లేదన్నారు. అందినా ఆరు మాసాలకు ఒక సారి సబ్సిడి వస్తుందని, ఇప్పుడు అది కూడా అందే పరిస్తితి లేదని తెలిపారు. ప్రస్తుతం శుభ కార్యాలు నిలిచిపోయి నూతన వస్త్రాలు కొనుగోలు కు అంతరాయంగా మారిందన్నారు. గతంలో టెస్కో కొంత ఖరీదు జరిగేద ని, ఇప్పుడు అవి కూడా నిలిచిపోయాయన్నారు. తక్షణమే ప్రతి చేనేత కు టుంబానికి నిత్యావసర సరుకుతో పాటు రూ.5 వేలు తక్షణ సహాయం కింద అందించి వస్త్ర నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేసి నూలు రవాణాను ప్రభు త్వం చేపట్టాలని సిపిఐ డిమాండ్ చేస్తోందని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.