HomeNewsBreaking News30 వరకు లాక్‌డౌన్‌?  

30 వరకు లాక్‌డౌన్‌?  

దేశవ్యాప్తంగా ఆంక్షలు పొడిగించే అవకాశాలు
లాక్‌డౌన్‌ కొనసాగించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు, నిఫుణులు విజ్ఞప్తి
సాధ్యాసాధ్యాలపై మోడీ ప్రభుత్వం సమాలోచనలు
ఇప్పటికైతే ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన సర్కారు  

న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌ను ఈనెల 30వ తేదీవరకు పొడిగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశంలో కరోనా కేసుల పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ పొడిగించాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు, నిపుణుల నుంచి కేంద్రానికి వినతులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ గడువు ఏప్రిల్‌ 14తో ముగుస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కేం ద్రం కసరత్తు చేస్తుంది. పలు రాష్ట్రాలతో పాటు నిపుణు లు సైతం పొడిగించాలంటూ తమ అభిప్రాయాలు తెలపడంతో లాక్‌డౌన్‌ కొనసాగించాలా? ముగించాలా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విస్తరించడంతో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే  అవకాశముందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, లాక్‌డౌన్‌పై సంప్రదింపులు జరుగుతున్నాయని, అయితే ఇంతవరకూ తుదినిర్ణయం తీసుకోలేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో లాక్‌డౌన్‌ను దశల వారీగా విరమించేందుకు ప్రణాళికతో ముందుకురావాలని మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ కోరిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌ పొడిగింపుపై దేశ ప్ర యోజనాల దృష్ట్యా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, స రైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ చెప్పకొచ్చారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో లాక్‌డౌన్‌ను కొనసాగించక తప్పదని తెలంగా ణ సిఎం కెసిఆర్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి బారి నుంచి మనం ప్రజల్ని రక్షించుకోవాలని, ఆర్థిక వ్యవస్థను తర్వాత చక్కదిద్దుకోవచ్చని కెసిఆర్‌ అభిప్రాయపడ్డా రు. ఇక రాజస్ధాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాడ్‌ సైతం లాక్‌డౌన్‌ను తక్షణ మే ఉపసంహరించరాదని, దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని అన్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై శాస్త్రీయ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని అసోం ప్రభుత్వం వెల్లడించింది. యుపి సైతం లాక్‌డౌన్‌ను మరికొంత కాలం కొనసాగించాలని కోరుతోంది. ఏ ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు వ్యక్తి మిగిలిపోయినా లాక్‌డౌన్‌ను సడలించడం కుదరదని, కరోనా రహిత రాష్ట్రంగా బయటపడేవరకూ కొనసాగించాలని ఆ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాష్‌ అవస్ధి తేల్చిచెప్పారు. కరోనా మహమ్మారి వ్యా ప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 24న మూడు వారాల లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దే శంలో మూడవ దశ కొనసాగుతున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి వచ్చే వారం రోజులు చాలా కీలకం కానున్న ది. అందువల్ల వెంటనే లాక్‌డౌన్‌ ఎత్తేసినా పరిస్థితి తిరిగి మొదటికి వస్తుంది. అందుకే లాక్‌డౌన్‌ పొడిగింపునకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధాని మోడీని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ఇటీవల ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కాగా భారత్‌లో కరోనా వైరస్‌ పరిస్థితిని అధ్యయనం చేస్తే, లాక్‌డౌన్‌ను జూన్‌ 3 వరకు పొడిగించడం ఉత్తమం అవుతుందని, అదే జరిగితే కరోనా నుంచి భారత్‌ పూర్తిగా బయటపడుతుందని బిజిఐ సంస్థ తన సర్వేలో వెల్లడించింది.
లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఆ వార్తలు నమ్మొద్దు : కేంద్రం
లాక్‌డౌన్‌ను పొడిగించాలని రాష్ట్రాలు కోరుతున్నాయనీ.. వారి ప్రతిపాదనలపై ఆలోచిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌  తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని చెప్పారు. పేదలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టిసారించారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష మందికి కరోనా పరీక్షలు చేయించామన్నారు. కరోనా చికిత్స కోసం ఆస్పత్రులను రెండు విధాలుగా విభజించామని.. కరోనా తీవ్రత, అత్యంత విషమంగా ఉన్న బాధితులకు వేర్వేరుగా చికిత్స అందిస్తామని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తామని ఆయన తెలిపారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న బాధితులకు ప్రత్యేక ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తామని లవ్‌ అగర్వాల్‌ వివరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments