ఏర్పాటు చేయాలని సిఎంకు చాడ వెంకట్‌రెడ్డి లేఖ
ప్రజాపక్షం / హైదరాబాద్ : మున్సిపల్ కార్మికులు, డాక్టర్లు, వైద్యసిబ్బందికి ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్రోత్సాహకాలు అభనందనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, నిరుపేదలు,చేతి వృత్తుల వారికి ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయక చర్యలు, బియ్యంసరఫరా 60 శాతం వరకే పూర్తయ్యిందనే సమాచారం అందుతోందని ఆయనన్నారు. ఈసమస్యలన్నింటిపై చర్చించడానికి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చాడ వెంకట్‌రెడ్డ్డి మంగళవారం లేఖ రాశారు. కుటుంబానికి ఇచ్చే ఆర్థిక సహాయం రూ.1500 నగదు ఇప్పటివరకు నిరుపేదల ఖాతాల్లో పడలేదని దీంతో వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. రోజు కూలీ చేయడం ద్వారా వ చ్చే కూలీ డబ్బులతో బ్రతికేవారని వారిపట్ల ప్రత్యే క దృష్టి పెట్టాలని ఆయనముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులకు సం బంధించి ఇప్పటివరకు చేపట్టి న సహాయక చర్యలు ఒక భాగమైతే, రానున్న గడ్డుకాలంలో వారికి మరిన్ని ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. లాక్డౌన్ ఏప్రిల్ నెలాఖరువరకు కొనసాగతే దానిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, అనేక మంది నిరుపేదలు ఆర్థికంగా చాలా చిక్కులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అర్హు లైన నిరుపేదల జాబితా జల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉందన్నారు. ఇప్పటికే అనేక మంది దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయాన్ని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కొంత మంది దాతలు నేరుగా కూరగాయలు , బయ్యం అందిస్తున్నారన్నారు. లాక్ డౌన్ ఇంకా పొడిగించే అవకాశం ఉన్నందున ఇలాంటి సమస్యలపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం సబబుగా ఉంటుందని చాడ వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
లాక్‌డౌన్‌పై తక్షణం అఖిలపక్షం : చాడ
RELATED ARTICLES