HomeNewsLatest Newsబిజెపి నాయకుల వింత పోకడలు

బిజెపి నాయకుల వింత పోకడలు

తాగునీటి పంప్‌హౌస్‌లో పసుపుమ, కుంకు, ఇతర మిశ్రమాలు కలిపిన వైనం
ముషీరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన  ఘటన
మద్దతు తెలిపిన టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : అసలే కరోనా వైరస్‌ భయపడుతున్న ప్రజలను ముషీరాబాద్‌ బిజెపి నాయకులు మరింత వణికిపోయేలా చేశారు. తాగునీటిలో పసుపు, కుంకుమలతో పాటు ఇతరాత్ర మిశ్రమాలను కలిపారనే విషయం సోమవారం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం స్థానికంగా బస్తీ వాసులకు తెలియడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బిజెపి నాయకుల అనాలోచిత నిర్ణయాలతో ఎంతో విలువైన తాగునీరు వృథాగా వదిలేయాల్సి వచ్చింది. కలుషితమైన  నీటిని వాటర్‌బోర్డు అధికారులు వదిలేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం  రాత్రి పది గంటల సమయంలో ముషీరాబాద్‌ రిసాల హరినగర్‌ పంప్‌హౌస్‌ నుంచి రాంనగర్‌ పరిసరాల్లోని 8 బస్తీలకు తాగునీరు సరఫర అవుతుంది. ఈ పంప్‌హౌస్‌ వద్ద సుమారు 30 మంది వరకు స్థానిక బిజెపి నాయకులు పూజలు నిర్వహించారని స్థానికులు చెప్పారు. పంప్‌హౌస్‌కు ఉన్న తాళాలు పగులగొట్టి పూనకం వచ్చిన మహిళతో పూజలు నిర్వహించారని స్థానిక బస్తీ వాసులు చెప్పారు. అంతే కాకుండా పసుపు, కుంకుమ ఇతర మిశ్రమాలను పంప్‌హౌస్‌ నీటిలో కలిపారన్నారు. విషయం తెలియడంతో స్థానిక బస్తీ వాసులు అక్కడికి చేరుకొని ముషీరాబాద్‌ బిజెపి నాయకులు రవిచారి, ఇతర నాయకులను నిలదీశారు. ఇదే విషయాన్ని ముషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు హుటాహుటిన అక్కడి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య రాత్రి రెండు గంటల వరకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకు బస్తీలో హైడ్రామా చోటు చేసుకుంది. రాత్రి అయినందుకు ఉదయం మాట్లాడుకుందామని పోలీసులు ఇరు వర్గాలను పంపించి వేశారు. అయితే ఈ విషయం సోమవారం ఉదయం దావానంలా వ్యాపించింది. దీంతో స్థానికులు ఘటనా స్థ్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెల్సిన ముషీరాబాద్‌ ఎంఎల్‌ఎ ముఠా గోపాల్‌, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ ముషీరాబాద్‌ ఇన్‌చార్జ్‌ ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ ఆర్‌.కల్పన యాదవ్‌లు  అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డిలు మాట్లాడుతూ వాటర్‌బోర్డు అధికారుల అనుమతి లేకుండా  బిజెపి నాయకులు పంప్‌హౌస్‌లోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. వాటర్‌బోర్డ్‌ పంప్‌హౌస్‌  ప్రజలకు సంబంధించి ఆస్తి అని, ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా ప్రజలు ఉపయోగించే తాగునీటిలో పసుపు, కుంకుమ, ఇతర మిశ్రమాలను ఏ విధంగా కలుపుతారని ప్రశ్నించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పిడిన బిజెపి నాయకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని, ప్రజలకు ఆత్మస్థయిర్యం కల్పించాలని అన్నారు. అనిల్‌కుమార్‌ యాదవ్‌, కల్పన యాదవ్‌ మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతిసే విధంగా వ్యవహరించిన బిజెపి నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. రిసాల హరినగర్‌ పంప్‌హౌస్‌ నుంచి రాంనగర్‌ పరిసర ప్రాంతాల్లోని 8 బస్తీలకు తాగునీరు సరఫరా అవుతుందని టిఆర్‌ఎస్‌ స్థానిక నాయకులు శ్యామ్‌ తెలిపారు. మైనారిటీలు, దళితులు నివాసం ఉండే ప్రాంతాల్లో నీటి సరఫర జరుగుతుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి యాక్ట్‌ ప్రకారం దళిత బస్తీల ప్రజలు ఉపయోగించే తాగునీటిని కలుషితం చేస్తే చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని అన్నారు. ఇదే విషయాన్ని తాము ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్‌స్పెక్టర్‌ మురళీ కృష్ణ తాము చూశామని నీరు ఎం కలుషితం కాలేదని అంటున్నారని శ్యామ్‌ అన్నారు. జరిగిన సంఘటనపై పంచనామా చేసి పోలీసులు కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
లక్ష లీటర్ల వదిలేశాం :  అధికారి దామోదర్‌రెడ్డి
రిసాల హరినగర్‌ పంప్‌హౌస్‌లోకి కొంతమంది బిజెపి నాయకులు వెళ్లి పూజలు నిర్వహించి, ప సుపు, కుంకుమ, ఇతర మిశ్రమాలను కలిపారని తెలిపారు. ఈ విషయం తెల్సిన వెంటనే అక్కడ నీ టి సరఫరాను అపివేశామన్నారు. చిలకలగూడ రిజర్వాయర్‌ నుంచి ప్రజలకు తాగునీరు సరఫరా చేశామని అన్నారు. కలుషితమైన నీటిని రో డ్డుపైకి వదిలేశామని చెప్పారు. జరిగిన  ఘటనపై వాటర్‌బోర్డ్‌ విజిలెన్స్‌ అధికారులు, చిలకలగూడ రిజర్వాయర్‌ మేనేజర్లు ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని అన్నారు. తమ అనుమతి లేకుండా పంప్‌హౌస్‌లోకి వెళ్లడం ట్రెస్‌పాస్‌ కిందకు వస్తుందన్నారు. అంతేకాకుండా ప్రజలు ఉపయోగించే తాగునీటిని కలుషితం చేయడం నేరమన్నారు. ఈ అంశాలపై తమ అధికారులు ఫిర్యాదు చేశారని దామోదర్‌రెడ్డి చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments