సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించి 14 రోజులు గడిచిన దరిమిలా నిరుపేదలందరికీ బియ్యం, ఆర్థిక సహాయం అందిం చి ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 14 రోజుల సుదీర్ఘ కాలంగా ప్రజలు స్వయం నియంత్రణలో ఇంట్లోనే ఉంటున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా కరోనా మహమ్మారి మూలంగా అన్ని రకాల ఇబ్బందుల కు గురి అయిన వలస కార్మికులు, నిరుపేదలు, రైతులేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి న తెల్ల రేషన్ కార్డులపై ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, రూ.1500 పూర్తి స్థాయి లో లబ్ధ్దిదారులకు చేరడం లేదని తెలిపారు. వీటి పంపి ణీ కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోందన్నారు. ప్రజ లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కాగా రేషన్ కార్డులు లేని నిరుపేదలు కూడ రాష్ట్రంలో లక్షల సంఖ్య లో ఉన్నారని తెలిపారు. వారికి సహాయం చేసే విషయంలో ప్రభుత్వం నుండి అనుమతి రాలేదని, అనుమతి వస్తే బియ్యం, డబ్బులు అందించే విషయం ఆలోచిస్తామని క్రింది స్థాయి అధికారులు చెబుతున్నారన్నా రు. దీంతో కార్డులు లేని నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సంక్షోభ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలందరికీ బియ్యం, డ బ్బులు ఇచ్చి అపన్న హస్తాన్ని అందించాల ని చాడ వెం కట్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మికులు రక్షణ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని, రోజు రోజుకి కరో నా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పలేమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వలసకూలీలను ఆదుకోవడం, వారిని సొంత ప్రాంతాలకు తరలించడం, రేషన్ కార్డు లు లేని వారిని ఆదుకోవాలని కోరారు.
గ్రామపంచాయతీ మల్టిపర్పస్ సిబ్బందికి రూ.8500 వేతనం చెల్లించాలి : గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టిపర్పస్ సిబ్బందికి 2019 నవంబర్‌లో ప్రకటించిన విధంగా రూ. 8,500 నెలస రి వేతనం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. గ్రామ పరిశుభ్రవత, త్రాగునీరు, ఆరోగ్యం, విద్య వంటి విషయాల గురించి చైతన్య పరుస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రోత్సహించేలా రూ. 8,500 నెలసరి వేతనం చెల్లించడానికి నిర్దారించిన విషయాన్ని ఆయన లేఖలో గుర్తు చేశారు. గ్రామ పంచాయ తీ పనులనే గ్రామ పంచాయితీ సిబ్బందికి అప్పజెప్పాలని ఉత్తర్వులిచ్చి ఉన్నారని, కొన్ని జిల్లాల్లో వేతనా లు చెల్లించడం లేదని, అనేక ఇబ్బందులు పెట్టి ప్రభుత్వ ఆలోచనా విదానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలలో అన్ని రకాల పనులను బాధ్యతాయుతంగా విధిగా నిర్వహిస్తున్న వీరికి అసంబద్దమైన పనులను అప్పజెప్తున్నారని చాడ వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.