కొత్త కేసుల్లో 90 శాతం ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారివే!
వారి కుటుంబ సభ్యులకూ కరోనా పాజిటివ్
మహారాష్ట్ర బాటలో ఢిల్లీ నడిస్తే… మర్కజ్ ముప్పు ముసురుకునేది కాదు
రోజురోజుకు పెరుగుతూనే ఉన్న కరోనా కేసులు
హైదరాబాద్ : కరోనా పాజిటివ్ కేసులతో పాటు, కొత్తగా మరణాలు కూడా చోటుచేసుకుంటున్న ప్రాంతాలను గుర్తించి కేంద్రం వాటిని హాట్స్పాట్లుగా గుర్తించింది. ఇదే బాటలో ముందుకు కదిలిన తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో కూడా ఆరు హాట్స్పాట్లను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలను చేపట్టింది. రాష్ట్రంలో నిర్మల్, భైంసా, నిజామాబాద్, గద్వాల, పాత బస్తీ, మిర్యాలగూడ ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో మర్కజ్ ప్రార్థనలకు వెల్లి వచ్చిన ఇసాఖ్ అలీ అనే వ్యక్తి కరోనాతో గురువారం మృతి చెందడంతో అప్రమత్తమైన అక్కడి జిల్లా కలెక్టర్ నాలుగురోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. కేవలం పాలు, కూరగాయలు వంటివి ఇంటి వద్దకే చేరేలా చర్యలు తీసుకున్నారు. ఈ నాలుగురోజుల పాటు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు వెల్లవద్దని ఆదేశించారు. నిర్మల్ నుంచి బయటకు, బయట ప్రాంతాల నుంచి నిర్మల్‌కు ఎవరు రాకుండా చర్యలు చేపట్టారు. మిగిలిన హాట్స్పాట్లలో కూడా అక్కడి అధికార యంత్రాంగం ఇదే చర్యలను చేపట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణలో మర్కజ్‌కు వెల్లిన వారిలో కొంత మందిని ఇంకా గుర్తించలేకపోతున్నామని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే కేంద్రం మాత్రం మర్కజ్లో పాల్గొన్న వారి పూర్తి వివరాలు సేకరించామని తెలిపింది. మొత్తం 9000 మంది ప్రార్థనల్లో పాల్గొనగా వీరిలో 1306 మంది విదేశీయలున్నారని పేర్కొంది. ఢిల్లీలోని 2000 మందిలో 1804 మందిని క్వారంటైన్‌కు తరలించామని తెలిపింది. మరో 334 మందికి కరోనా లక్షణాలు ఉండడంతో వారిని ఆసుపత్రులకు తరలించామని ప్రకటించింది. అయితే ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో మర్కజ్‌కు వెళ్ళి వచ్చిన వారి మొత్తం జాబితా కనుక్కోలేదని ఈ రెండు ప్రభుత్వాలు చెబుతుండడాన్ని బట్టి చూస్తే కేంద్రం తప్పుడు సమాచారం ఇచ్చిందా, లేక తెలుగు రాష్ట్రాలే వాస్తవాలు వెల్లడించడం లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవాలను పరిశీలిస్తే… మర్కజ్ వెళ్ళి వచ్చిన వారిని గుర్తించేందుకు తెలంగాణలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టగా గురువారం పాత బస్తీలో, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలలో కొందరు చిక్కగా మరి కొందరు తప్పించుకున్నారు. అంటే ఇంకా మొత్తం మంది ప్రభుత్వ ఆధీనంలోని రానట్లే. పైగా గుర్తించి పరీక్షలు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ తేలుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో గుబులు మొదలైంది. ప్రధానంగా తెలంగాణలో దాదాపు 99శాతం కొత్త కేసులు మర్కజ్‌కు వెల్లి వచ్చిన వారివే ఉంటుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్లో ఒక్క రోజే నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో ముగ్గురు మర్కజ్ వెల్లి వచ్చిన వారు కాగా, మరొకరు ఇండోనేషియా నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. అలాగే నల్గొండలో ఒకే రోజు ఆరు పాజిటివ్ కేసులు వెలుగుచూసాయి. వీరిలో ఒకరు మిర్యాలగూడ వాసి కాగా మిగిలిన అయిదుగురు నల్గొండ టౌన్‌కు చెందిన వారు. వీరంతా మర్కజ్‌కు వెల్లి వచ్చిన వారే. మొత్తం 44 కేసులు వెలుగు చూడగా వీరికి చెందిన 39 మంది కుటుంబ సభ్యులను 15 వాహనాల్లో క్వారంటైన్‌కు తరలించారు. మర్కజ్‌కు వెల్లి వచ్చిన వారిలో ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న పాత బస్తీలో 124 మందిని గుర్తించారు. గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 119 మందిని యునాని ఆసుపత్రికి తరలించారు. పాత బస్తీలో మర్కజ్‌కు వెల్లి వచ్చిన వారు, వారి సంబంధీకులు సహకరించడం లేదని పోలీసులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. అంతే కాకుండా పాత బస్తీలోని చాలా ప్రాంతాలలో లాక్డౌన్ నిబంధనలను కూడా పాటించడం లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం 161 పాజటిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 140 మంది మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే. అంటే ఢిల్లీ వెల్లి వచ్చిన వారు ఇలా చేసి ఉండకపోతే ఏమేరకు ఇక్కడ కరోనా అదుపులో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. అంటూ కరోనా ఫ్రీ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఢిల్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా తీవ్ర అలజడి లేపింది.
మహారాష్ట్ర బాటలో నడిచి ఉంటే..
మత ప్రార్థనల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం నడిచిన బాటలో ఢిల్లీ ప్రభుత్వం నడిచి ఉంటే ఇంతటి పెనుముప్పు వచ్చి ఉండేది కాదన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. కారణం మర్కజ్లో జరగాల్సిన ప్రార్థనలు నిజానికి మహారాష్ట్రలో జరగాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో మార్చి మొదటి వారంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సభలు, సమావేశాలలకు అనుమతి నిరాకరించింది. తబ్లిగి జమాతే మార్చి 6న మత ప్రార్థనల నిర్వహణకు మహారాష్ట్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకుంది. కరోనా కారణంగా మహారాష్ట్ర ఈ ఈవెంట్‌ను నిరాకరించింది. రద్దు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో తబ్లిగి జమాతే ఈ ఈ ప్రార్థనలను ఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించింది. అక్కడి హోం శాఖకు దరఖాస్తు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు ఎందుకు పూర్తిగా విచారించలేదో, ఈవెంట్ నిర్వహణను ఎందుకు అడ్డుకోలేదో తెలియని పరిస్థితి. దీంతో ఇప్పుడు దేశం యావత్తు కరోనా బారిన పడి విలవిలలాడి పోతోంది. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ప్రార్థనల్లో పాల్గొన్న 960 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. వీరిపై విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది.
హాట్స్పాట్లలో పూర్తిగా లాక్డౌన్
RELATED ARTICLES