బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఒవైసీ హాస్పిటల్‌ను ఐసోలేషన్ వార్డుగా ప్రభుత్వం వినియోగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐఎం నేత అసద్దోద్దీన్ ఒవైసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మైనార్టీ ఓట్లతో రాజకీయ పబ్బం గడిపే ఒవైసీ ఈ కరోనా వైరస్ నివారణకు పిలుపునివ్వకపోవడం విచారకరమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా బారిన పడిన ముస్లిం సమాజాన్ని రక్షించడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఒవైసీకి తగదన్నారు. డాక్టర్లపై దాడిని ఒవైసీ ఖండించకపోవడం సిగ్గు చేటన్నారు.
మర్కజ్ సమావేశాల వెనక ఏమైనా కుట్ర దాగి ఉందా?
మర్కజ్ నిజాముద్దీన్ సమావేశం వెనక ఏమైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో విచారణ చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌కు వెళ్లిన వారిని రక్షించడానికి పాతబస్తీకి వెళ్లిన ఆశావర్కర్లు, ఆరోగ్య సిబ్బందిపై దాడి చేయటం హేయమైన చర్య అని ఆయన అన్నారు. కనీసం మహిళలు అని కూడా చూడకుండా వారి దాడికి దిగడం చాలా బాధాకరమని, ఈ దాడులను బిజెపి తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ఈ దాడిని దేశం మీద చేస్తున్న దాడిగా పరిగణిస్తున్నామన్నారు. దాడి చేస్తున్న వారిని దేశద్రోహులుగా పరిగణించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని, సున్నితమైన ప్రాంతాల్లో వివరాల సేకరణకు వెళ్తున్న ఆరోగ్య సిబ్బందికి సరైన భద్రత కల్పించాలని కోరారు.
ఒవైసీ హాస్పిటల్‌ను ఐసోలేషన్ వార్డుగా ప్రభుత్వం వినియోగించాలి
RELATED ARTICLES