ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. బాధితుల సంఖ్య వందకు చేరువవుతున్నది. తాజాగా ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య రాష్ట్రంలో 97కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో ఇప్పటికే 14 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 77 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు వైరస్ ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వైరస్ వ్యాప్తిపై సమీక్ష సమావేశాలు నిర్వహించి తాజా సమాచారాన్ని తెలుకుంటున్నారు. తదనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను అదేశిస్తున్నారు. మరోవైపు వలస కూలీల సమస్య పరిష్కరించేందుకు అధికారులు ఆయా జిల్లాల్లో ప్రయత్నిస్తున్నారు. వలసకూలీలను గుర్తించి, వారికి సాయం అందిస్తున్నారు.
తెలంగాణ కరోనా కేసులు 97
RELATED ARTICLES