HomeNewsBreaking Newsనిజాముద్దీన్‌లో క‌రోనా క‌ల‌క‌లం

నిజాముద్దీన్‌లో క‌రోనా క‌ల‌క‌లం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిజాముద్దీన్ అలజడి రేపింది. నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనంలో ఉంటున్న వారికి పెద్ద సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో ఒక్క‌సారిగా దేశం ఉలిక్కిప‌డింది. మ‌తప‌ర‌మైన ఒక కార్య‌క్ర‌మం జ‌మాత్‌లో పాల్గొనేందుకు 2500 మందికిపై దేశ‌విదేశాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారి నుంచే క‌రోనా వైర‌స్ చాలామందికి సోకిన‌ట్లుగా అనుమానిస్తున్నారు. లాక్‌డౌన్ విధించ‌డంతో స‌గంమంది వెళ్లిపోగా, 1200 మంది అక్క‌డే వుండిపోయారు. ఇప్పుడు వారిలో చాలామందికి క‌రోనా సోకిన‌ట్లు స‌మాచారం. ఈ జ‌మాత్‌కు ఎపి, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌యిన‌ట్లుగా చెపుతున్నారు. పైగా జిహెచ్ఎంసి నుంచి 800 మందికి పైగా ఈ జ‌మాత్‌కు హాజ‌రైన‌ట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో తెలంగాణ‌కు క‌రోనా మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా పొంచివున్న‌ట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ స‌మ‌యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని కోరారు. కాగా, నిజాముద్దీన్ నుంచి బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్ అనుమానంతో 860 మందిని ఢిల్లీలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఇంకా 300 మందికిపైగా ఈ భవనంలో ఉన్నట్లు అధికారుల గుర్తించారు. మర్కజ్ భవనంలో ఉన్న వ్యక్తుల్లో చాలా మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రికి తరలించిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇక్కడ జరిగిన సమావేశంలో పాల్గొని వెళ్ళిపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో 10మంది కరోనాతో మృతి చెందారు. ఈ నెల 1 నుంచి 15 వరకు జరిగిన మతప్రార్థనల్లో దాదాపు 2,500 మంది పాల్గొన్నట్టు భావిస్తున్నారు. లాక్ డౌన్ విధించిన తర్వాత మర్కజ్ భవనంలోనే 1200 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తంచారు. లాక్ డౌన్ తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ఒకే చోట ఉండటంపై చర్యలు తీసుకోవాలని దిల్లీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఈనెల 24న నోటీసు ఇచ్చారని… స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో అంతా ఇక్కడే ఉన్నారని మర్కజ్ అధికార ప్రతినిధి తెలిపారు. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments