ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని నివారించుటకు ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర కూరకాయలను ప్రజల ముంగిటకే తెచ్చెoదుకు తెలంగాణ ప్రభుత్వం మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసింది.నగరవాసుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యయసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జి హెచ్ ఎం సి సహకారంతో నగరంలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శనివారం 177 మొబైల్ రైతు బజార్లు ద్వారా నగరంలోని 331 ప్రాంతములలో కూరకాయలు విక్రయిoచారు. నిర్దేశించిన ధరలకే మొబైల్ రైతు బజార్ల లో కూరకాయలు అమ్మాలని అధికారులు ఆదేశించారు. అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వుండే విదంగా ప్రతి మొబైల్ రైతు బజారు వాహనం తిరిగేవిధంగా షెడ్యూలును,ఏ ఏ ప్రాంతాలలో ఎక్కడ అమ్మాలో సమయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. దీనితో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.