HomeOpinionArticlesక‌రోనా దెబ్బ... కార్పొరేట్ల‌కా? క‌టిక ద‌రిద్రానికా?

క‌రోనా దెబ్బ… కార్పొరేట్ల‌కా? క‌టిక ద‌రిద్రానికా?

చేతిలో చిల్లిగవ్వ లేదు. బస్సులు లేవు. రైళ్ల కూతలు వినపడటం లేదు. కంపెనీలన్నీ మూసివేశారు. పైగా కరోనా వైరస్‌ కబళిస్తోందట. కనీసం సొంత ఇంటికి వెళ్తే..ప్రాణాలు నిలుస్తాయని భావించిన…వలస కార్మికులు ప్రస్తుతం వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. పిల్లాజెల్లాతో కలసి…ఆకలి దప్పుల్ని పక్కన పెట్టి.. ఊరి పొలిమేర దిక్కున కాలి నొప్పుల్ని పణంగా పెట్టారు. కరోనావైరస్‌ సంక్షోభ నివారణకు ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించగా… పేదల బతుకు నడిరోడ్డున పడింది. కర్మాగారాలు. సంస్థలు మూతపడ్డాయి. నిర్మాణ మైదానం బోసిపోయింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వలస కార్మికులు పల్లెబాట పట్టగా… జాతీయ రహదారులు కిక్కిరిపోయాయి. మార్గ మధ్యలో పోలీసుల హడావిడి. తనిఖీలు.. లాఠీ దెబ్బలు…కానీ ఊరుకు చేరుకోవటానికి పిల్లాజెల్లాతో వలస కార్మికుడి వెత వర్ణనాతీతం. ఉత్తరాది రాష్ట్రాల్లో రోడ్లు పోటెత్తాయి. సరిహద్దుల్లో జనం తండోపతండాలుగా జాతర నడిరోడ్డుపై నడుస్తోంది. రాజస్థాన్‌ సరిహద్దులోని మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల కార్మికులు వేల సంఖ్యలో గ్రామాలకు బయలుదేరారు. సుమారు 4500 మంది సరిహద్దుల్ని దాటారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి వలస కార్మికులు వందల కిలోమీటర్లను లెక్క చేయకుండా తమ గ్రామాలకు బయలుదేరారు. కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు మార్చి 22, ఆదివారం సామాజిక దూరం, ప్రాణాంతక వ్యాధికి ”జనతా” కర్ఫ్యూను విధించారు. ప్రధాని మోడీ ప్రసంగంతో…నగరాలు అనిశ్చితి, పుకార్లతో కలవరపడ్డాయి. అంతే.. ప్రజలు తమకు కావలసినది కొన్నారు. బాగా మడమ తిరిగిన స్టోర్‌ అల్మారాలు, ఆన్‌లైన్‌ కిరాణా జాబితా, ఆహారం, శానిటైజర్లు, ప్రాథమిక ఔషధాలలను ప్రజలు తమకు నచ్చిన రీతిలో కోకొల్లలుగా కొన్నారు. అప్పుడే… వలస కార్మికులు ఇంటికి బయలుదేరారు. ఇంటి గడప దాటొద్దని ప్రధాని మోడీ సెలవిచ్చారు. ఔను ఇంటికి వెళ్లాలి. రైల్వే స్టేషన్లకు చేరారు. దొరికిన రైలు బండి ఎక్కారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు నుంచి నిండిన రైళ్ళలో కిక్కిరిసిన మంది పురుషులు బయలుదేరే వీడియోలు వైరల్‌ అయ్యాయి. రైళ్లు కిక్కిరిసి పోయాయి. ఆ రైళ్ళల్లో చొటు దొరకనోళ్లు నిస్సారంగా నడిరోడ్డుకు చిక్కుకున్నారు – ఇంటకి దూరంగా…బస్సులు.. రైల్వే స్టేషన్లను మూసివేయగా.. జీవనోపాధి లాక్‌డౌన్‌తో నడకే పణంగా వలస బతుకులు బయలుదేరాయి. ఇక విదేశాల్లో 15 లక్షల మంది భారతీయులూ అల్లాడిపోతున్నారు. పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, విమాన యానం సాయానికి ప్రభుత్వం… వెనుకకు వంగి వంగి ప్రదక్షిణలు చేసింది. విమాన యానాన్ని రద్దు చేసినా.. ప్రత్యేక విమానాలను రంగంలోకి దించింది. విమానాశ్రయంలో.. అనుమతించే.. మినహాయింపులు, ప్రత్యేక వీసాలనూ జారీ చేసింది. అంతే భారతదేశంలోకి కరోనా మహమ్మారి రంగప్రవేశానికి ఇబ్బంది కలగలేదు. కానీ భారతీయ పౌరులు,.. కుటుంబాలు, తమ సొంత ఇళ్లల్లో మకాం వేయక తప్పలేదు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే… చేతిలో పని చేజారినప్పుడే వలస కార్మికులు తమ ఇళ్లకు బారులు తీస్తారు.నరేంద్ర మోడీ పదవీకాలంలోనే వలస కార్మికులు తమ చేతిలో పనిని పోగొట్టుకున్నారు. ఆయన పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడూ.. పరిశ్రమలు మూతపడ్డాయి. నిర్మాణ రంగం నిలిచిపోయింది. తమ ఖాతాదారుల దగ్గర నగదు లేదని విక్రేతలు, వర్తకులు కనుగొన్నారు. అందుకే ఉత్తరాదిలో… తూర్పులోని పేద రాష్ట్రాలలో వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం మరీ గడ్డు పరిస్థితి తాండవిస్తోంది.
పని, వేతనం కోల్పోవడమే కాదు, అపరిచితుల మధ్య అనారోగ్య ప్రాణభయం వలస కార్మికులను ఇంటికి తరిమేసింది. ఇళ్ల రద్దీ సమస్యను పరిష్కరించకుండా.. సన్నిహిత సంబంధాలపై ఆధారపడిన జీవనోపాధిని పరిష్కరించకుండా… సామాజిక దూరం సాధన అవసరాన్ని ప్రధాని మోడీ ఎకరవు పెట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులు పనికి వెళ్లకపోయినా..వేతనం చెల్లించాలని ప్రధాని ఇచ్చారు. కాని వలస కార్మికులను గుర్తు చేసుకోలేదు. ”మీరు ఎక్కడున్నారో…అక్కడే ఉండండి” అని శాసించారు. బస్సులు నడవని బస్‌ స్టేషన్లలో రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారాలు, వీధుల్లో.. హైవేలలో వేచి ఉండాలి. స్వచ్చంద సంస్థల ఔదార్యంపై ప్రాణాలను నిలుపుకోవాలి. విమానం టికెట్‌ లేనోళ్లపై ప్రభుత్వం బాధ్యత వహించదు. అని అన్నారు. మోడీ సర్కారు సంధించిన విస్పష్ట.. సందేశ ఘర్జనలో.. దేశంలోని పేదలు కొట్టుకుపోయారంటే అతిశయోకి కాదు. ఔను.. 2016లోనూ ఇదే ధోరణిలో నోట్ల రద్దును ప్రకటించగా…చిల్లర నోట్ల కోసం యావత్‌ భారత దేశం పడిగాడుపులు పడిన సంగతి విధితమే.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments