న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్ర ప్రభావం నేపథ్యంలో కేంద్ర ఇంధనశాఖ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. విద్యుత్ రంగానికి సంబంధించిన పలు సహాయక చర్యలను కేంద్రమంత్రి ఆర్ .కె.సింగ్ ఆమోదం తెలిపారు. సెక్యూరిటీ డిపాజిట్ ను 50 శాతం తగ్గించాలని, జెన్ కోలు ట్రాన్స్ మిషన్ కు చెల్లింపు చేయడానికి డిస్కమ్ లపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించాలని సూచించింది. ఆలస్యంగా విద్యుత్ బిల్లులు చెల్లించినందుకు జరిమానా విధించవద్దని కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ (సిఇఆర్ సి)కి ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ విద్యుత్ రెగ్యులేటరీ సంస్థలకు ఇలాంటి ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. విద్యుత్ ఉత్పత్తిలో 70% బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుంచే జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ బొగ్గు కంపెనీల బొగ్గు సరఫరా, రైల్వేల రవాణాను కొనసాగించడానికి రైల్వే, బొగ్గు మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇంధనశాఖ వెల్లడించింది. లాక్డౌన్ కారణంగా వినియోగదారులు తమ బకాయిలను పంపిణీ సంస్థలకు (డిస్కమ్ ) చెల్లించలేరు. దీని ప్రభావం డిస్కమ్ లిక్విడిటీపై పడుతుందని, తద్వారా ఉత్పత్తి, ప్రసార సంస్థలకు చెల్లించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ విద్యుత్ రంగానికి గణనీయమైన సహాయక చర్యలను ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, పంపిణీ సంస్థలకు మధ్య అధిక మొత్తంలో బకాయిలు ఉన్నా.. విద్యుత్ నిరంతరం కొనసాగించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ శాఖ ప్రకటించింది.
విద్యుత్ రంగానికి ఉద్దీపన ప్యాకేజీ
RELATED ARTICLES