న్యూఢిల్లీ : భారతదేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నానికి దేశవ్యాప్తంగా 944 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కొవిడ్ -19 కారణంగా దేశంలో ఇప్పటివరకు మొత్తం 20 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో 84 మంది కోలుకోగా ప్రస్తుతం 775 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా 57 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ మహమ్మారి దాదాపు అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణలోనే ఇప్పటివరకు 59కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొవిడ్ -19 తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ కరోనా కారణంగా నలుగురు మరణిచంగా గుజరాత్ లో ముగ్గురు మరణించారు. కర్ణాటకలో ఇద్దరు మరణించగా కేరళలో దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏపీలో 13 మందికి కరోనా పాజిటివ్ గా గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్రాల వారీగా
భారత్ లో ఈ మహమ్మారి సోకిన వారిలో 84 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, ఈ వైరస్ బారిన పడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు 27 రాష్ట్రాల/ కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా విస్తరించింది. ఈ రోజు రాష్ట్రాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర 180; కేరళ 173; కర్ణాటక 55; రాజస్థాన్ 48; తెలంగాణ 48; యూపీ 45; గుజరాత్ 45; దిల్లీ 39; పంజాబ్ 38; తమిళనాడు 38; హరియాణా 33; మధ్యప్రదేశ్ 30; జమ్మూకశ్మీర్ 18; పశ్చిమబెంగాల్ 15; ఆంధ్రప్రదేశ్ 14; ఛత్తీస్ గఢ్ 6; అండమాన్ నికోబార్ దీవులు 2; బిహార్ 9; చండీగఢ్ 7; గోవా 3; హిమాచల్ ప్రదేశ్ 3; లద్దాఖ్ 13; మణిపూర్ 1; మిజోరం 1; ఒడిశా 3; పుదుచ్చేరి 1; ఉత్తరాఖండ్ 5 చొప్పున మొత్తంగా 944 కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో 944 కరోనా కేసులు, 20 మరణాలు
RELATED ARTICLES