లండన్ : బ‌్రిటన్‌లో కరోనా వైరస్ పెద్ద పెద్ద తలకాయలను సైతం పట్టి పీడిస్తున్నది. నిన్న కాక మొన్న బ్రిటన్ యువరాజు ఛార్లెస్‌ను సోకిన కరోనా వైరస్ తాజాగా ప్రధానికి తాకింది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కొవిడ్ -19 సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన ట్విటర్ లో వీడియో ద్వారా వెల్లడించారు. గురువారం నుంచి తనలో ఈ వ్యాధి లక్షణాలు స్వల్పంగా కనిపించాయని తెలిపారు. ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నానని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రభుత్వాన్ని నడిపిస్తానని వెల్లడించారు. వైరస్ పై సమష్టిగా పోరాడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.
బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్
RELATED ARTICLES