న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చెలరేగుతుండటంతో దానిపై పోరాటానికి వివిధ దేశాల గ్రూపులు సమాయత్తమవుతున్నాయి. తాజాగా జి20 దేశాలు కరోనాపై కలిసి పోరాడాలని ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ దిశగా ఐక్య సంఘటనగా ఏర్పడాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు జి20 దేశాల నాయకుల మధ్య గురువారంనాడు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు 20 దేశాల నాయకులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రపంచ యుద్ధాల కన్నా ప్రమాదకరంగా మారిందని, ప్రస్తుతం ఇది అందరి శత్రువు అని నేతలు ఉద్ఘాటించారు. కరోనాను ఎదిరించే క్రమంలో పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. అవసరమైన జి20 దేశాల మధ్య పరస్పర ఆర్థిక సహకారం కూడా వుండాలని తెలిపారు. దీనిపై పోరుకు ఒక అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళికకు సంసిద్ధతను ప్రకటించారు. కరోనా వైరస్ వాక్సిన్‌ను కనుగొనేందుకు అవసరమైన ఆర్థిక సాయం ఇవ్వడానికి తాము సిద్ధమని సౌదీ అరేబియా రాజు సాల్మన్ ప్రకటించారు. కరోనాను అదుపు చేసేందుకు భారత్ చేపట్టిన చర్యలను ఇతర దేశాలు ప్రశంసించాయి. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఈ వ్యాధి ప్రభావం చాలా తక్కువగా వుందని, ఇదే స్ఫూర్తిని మిగిలిన దేశాలు కూడా కొనసాగించాలని నేతలు సూచించారు.
కరోనాపై కలిసి పోరాడుదాం : జి20 ప్రకటన
RELATED ARTICLES