ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా వైరస్ మృతుల పట్ల వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుడు చనిపోయినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మంత్రి స్పష్టంచేశారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ గా ఉన్న వ్యక్తులు కోలుకుంటున్నారని అన్నారు. కొత్తగా రాష్ట్రంలో ఎలాంటి కొత్త కేసు నమోదు కాలేదని, ప్రజలు ఇదే స్ఫూర్తితో ఇళ్లకే పరిమితమై వుండాలని కోరారు. క్వారంటైన్‌లో ఉన్న బాధితులందరికీ చికిత్స అందిస్తున్నామని, అలాగే పాజిటివ్ తేలిన రోగులందరూ కోలుకుంటున్నారని, ఎవరి ప్రాణానికి ముప్పులేదని చెప్పారు.
తెలంగాణలో మృతులు లేరు : ఈటల
RELATED ARTICLES