లండన్ : బ్రిటిష్ రాజ్య వారసుడు ప్రిన్స్ ఛార్లెస్‌కు కరోనా వైరస్ సోకింది. టెస్టుల్లో కొవిడ్ 19 పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణయిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. 71 ఏళ్ల క్వీన్ ఎలిజిబెత్ పెద్దకుమారుడు, బ్రిటన్ రాజ్య వారసుడు అయిన ప్రిన్స్ ఛార్లెస్ (ప్రిన్స్ ఆఫ్ వేల్స్)కు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఈ టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ ఉన్నట్లు తేలిందని క్లారెన్స్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆయన ప్రాణానికి ప్రమాదం లేదని, కోలుకుంటున్నట్లు పేర్కొంది.