లండన్ : ఐరోపా దేశాల్లో కరోనా వైరస్ చెలరేగుతోంది. ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్, ఇటలీ దేశాల్లో కరోనా ప్రజలను వణికిస్తున్నది. స్పెయిన్‌లో కేవలం ఒక్కరోజే అంటే 24 గంటలో్ల ఏకంగా 700 మందికిపైగా మరణించారు. బుధవారం 738 మంది మరణించడంతో మొత్తంగా స్పెయిన్‌లో కరోనా మృతుల సంఖ్య 3,434 మందికి పెరిగింది. దీంతో కొవిడ్ 19 మృతుల విషయంలో స్పెయిన్ తాజాగా చైనాను మించిపోయింది. ఈ ఒక్కదేశంలోనే ఇప్పటివరకు కొవిడ్ 19 సోకి 47,610 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇంకెంతమంది చనిపోతారో స్పెయిన్ అధికారులకు అర్థం కాక తలలు పట్టుక్కూర్చున్నారు.