HomeNewsLatest Newsఅఖిల్ పై రూమర్లకి క్లారిటీ ఇచ్చిన నాగ్

అఖిల్ పై రూమర్లకి క్లారిటీ ఇచ్చిన నాగ్

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ మొదటి సినిమా ఫెల్యూర్ తో అక్కినేని ఫాన్స్ మరియు అక్కినేని ఫ్యామిలీ డిజప్పాయింట్ అయ్యారు. అందుకే నాగార్జున, అఖిల్ రెండవ సినిమా పై ప్రత్యేకమైన శ్రద్ధ పెడతున్నారు. అక్కినేని ఫ్యామిలీ కి మనం లాంటి హిట్ సినిమా ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండవ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాని నాగ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా విక్రమ్ సినిమా ఫిజికల్‌గా చాలా డిమాండ్ చేస్తోందని, కొత్త ట్రైనర్ వర్కవుట్ షెడ్యూల్ ఇచ్చారు. డైట్ కూడా ప్లాన్ చేశారని స్వయంగా అఖిల్ ఇటీవల ఓ అప్‌డేట్ ఇచ్చాడు.

ఈ సినిమాలో అఖిల్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంతవరకు తెలియలేదు. నాగ్ ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. అఖిల్ సరసన సూట్ అయ్యే ఆ బాలీవుడ్ భామ ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదు, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఖుషీ కపూర్ రెమ్యునిరేషన్ చాలా భారీగా అడుగుతుందని, దానికి నాగార్జున వెనకాడటం లేదని కూడా వార్తలు హల్చల్ చేసాయి.

అయితే ఈ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ నాగార్జున ఒక రీట్వీట్ చేసారు. అందులో.. ఖుషీకి భారీ పారితోషికం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వచ్చిన ఓ కథనం, నిజం కాదనిస్పష్టం చేశారు. అయితే హీరోయిన్ ఎవరైనప్పటికీ అఖిల్ సినిమా సూపర్ హిట్ కావాలని అక్కినేని ఫాన్స్ అంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అఖిల్ సరసన, ఏ వుడ్(టాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్)  భామ నటిస్తుందో చూడాలి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments