పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
కరాచీ: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలతో అక్మల్ సంప్రదింపులు జరిపినట్లు వెలుగులోకి రావడంతో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అతనిపై ఇటీవల సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అక్మల్‌పై విచారణ పూర్తయ్యే వరకూ అతను ఎటువంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పిసిబి ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా అక్మల్‌పై పాక్ క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. అవినీతి నిరోధక కోడ్‌లోని పలు ఉల్లంఘనలకు పాల్పడినందున ఉమర్ అక్మల్‌కు పిసిబి నోటీసులు జారీ చేసింది. ఫిక్సింగ్‌కు సంబంధించిన విషయాలను ఉద్దేశపూర్వకంగా బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేయనందున ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మార్చి 31లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ అక్మల్ చెప్పే కారణాలతో పిసిబి సంతృప్తి చెందకపోతే.. అతడిపై ఆరు నెలల నుంచి గరిష్టంగా జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్‌లో అక్మల్ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే పిసిబి అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. అయితే పిఎస్ఎల్ 2020 సీజన్లో తమ ఫ్రాంచైజీ తరఫున ఆడేందుకు అక్మల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న క్వెట్టా గ్లాడియేటర్స్.. తాము చెల్లించిన అడ్వాన్స్ మొత్తం తిరిగివ్వాలని స్పష్టం చేసింది. దీంతో అక్మల్‌కు మరో తలనొప్పి ఎదురైంది.,టోర్నీకి ముందే క్వెట్టా గ్లాడియేటర్స్ పేమెంట్‌లో 70 శాతాన్ని అతనికి అందజేసింది. కానీ.. అతనిపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆ డబ్బుని వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేయాలని గ్లాడియేటర్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎస్ఎల్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు విన్నవించింది.
అక్మల్‌పై జీవితకాల నిషేధం
RELATED ARTICLES