ఇస్లమాబాద్ : కరోనా కారణంగా ప్రపంచం గడగడలాడుతుంది. ఈ వైరస్ ప్రభావం చైనా లో తగ్గిపోతుంది కానీ మిగితా దేశాలలో అతి వేగంగా వ్యాపిస్తుంది. అయితే ఈ వైరస్ బాధితుల సంఖ్య మన దేశం లో అంతకంతకు పెరిగిపోతుంది. ప్రస్తుతం మన దేశం లో కరోనా బాధితుల సంఖ్య 296 గా ఉంది. అలాగే మన తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 20కి చేరుకున్నాయి. అయితే ఈ వైరస్ ప్రభావం క్రీడారంగం పైన చాల పడ్డింది. అయితే ఇప్పుడు ఓ అంతర్జాతీయ క్రికెటర్ కు కరోనా సోకింది. పాకిస్థాన్ దేశస్థుడైన మజిద్ హాక్… స్కాట్లాండ్ జట్టు తరుపున ఆఫ్‌స్పిన్నర్‌గా అంతర్జాతీయ ఆటగాడిగా ఆడాడు. అతను 2006 నుంచి 2015 వరకు అంతర్జాతీయ క్రికెటర్‌గా కొనసాగిన అతను మొత్తం 54 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. అయితే ప్రపంచం మొత్తం వ్యాపిస్తున్న కరోనా వైరస్ తనకు సోకడం తో చికిత్స తీసుకుంటున్నానని ట్వీట్ చేశాడు. గ్లాస్గోలోని రాయల్ అలెగ్జాండ్రియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తా’ అని మజిద్ ట్వీట్ చేశాడు. అయితే ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు మన దేశంలో 5 మరణించారు.
అంతర్జాతీయ క్రికెటర్‌కు కరోనా
RELATED ARTICLES