చెన్నై : ప్రముఖ సినీ నటి అమలాపాల్ తన ప్రి యుడు భవిందర్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. భవిందర్‌సింగ్-అమలాపాల్ వెడ్డింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. సిక్కు సంప్రదాయ పద్దతిలో వీరిరువురి వివా హం జరిగినట్లు ఫొటోలను చూస్తే అర్థమవుతోంది. 2014 లో డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో విడాకులు తీసుకున్న తర్వా త.. తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు అమలాపాల్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ముంబైకి చెందిన గాయకుడు భవిందర్ సింగ్ అమలాపాల్‌తో కలిసి ఉన్న ఫొటోలు సామాజికమాధ్యమాల్లో షేర్ చేయడంతో.. అమలాపాల్ ప్రియుడు భవిందర్ సింగేనని నెటిజన్లు క్లారిటీకి వచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అమలా పాల్ తన ప్రియుడి గురించి.. ‘నేను మారిన వ్యక్తి, నేను నా పనిని చూసే విధానం ఆయనకు నచ్చింది. నా ప్రతీ పనిలో అతను సహాయం చేస్తాడు. అందుకే నేను అతనికి రుణపడి ఉంటాను. ఒక తల్లి మాత్రమే బేషరతుగా తన ప్రేమను ఇవ్వగలదు. ఈ వ్యక్తి కూడా నాకోసం త్యాగం చేయగలడని, తన ఉద్యోగాన్ని నాకోసం విడిచిపెట్టగలడని నిరూపించాడు. నా అభిరుచి అతనికి తెలుసు కాబట్టి నాతో పాటు తనకూ మద్దతు ఇవ్వండి’ అని చెప్పింది.
ప్రియుడితో అమలాపాల్ వివాహం..!
RELATED ARTICLES