ప్రజాపక్షం/హైదరాబాద్: భయంకరమైన కరోనానే కాంగ్రెస్ పార్టీ అని, ఈ దరిద్రం ఎప్పుడు వదులుతదో తెలియదని, ఇప్పటికే వదిలిందని, ఇంకా వదులాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కరోనా నియంత్రణకు కేం ద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే మాటలు సరికాదని, అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని విధాల సన్నద్ధంగానే ఉన్నామని, రాష్ట్రంలో కరోనా ప్ర భావం పెద్దగా లేదని, ప్రజలు ఎవ్వరూ భయందోళన చెందాల్సిన అసవరం లేదని భరోసనిచ్చారు. శాసనసభలో శనివారం ‘రాష్ట్రంలో కోవిడ్(కరోనా)’ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చను ముఖ్యమంత్రి ప్రారంభించగా, అనంతరం సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యులు కౌసర్ మొయినుద్దీన్,టిఆర్ఎస్ స భ్యులు మల్లయ్యయాదవ్ చర్చలో పాల్గొని పలు అంశాలను ప్రస్తావించారు. చర్చకు ముఖ్యమంత్రి కెసిఆర్ స మాధానమిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటోందని, విదేశాల నుండి రాకపోకలను నిలిపివేస్తూ వారి వీసాలను రద్దు చేసిందని వివరించారు. ఇలాంటి సమయంలో పాలకులు బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేసి ప్రజలను భయాం దోళనకు గురిచేయవద్దని సూచించారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నదని, కరోనా వ్యాపిస్తే దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ లో 150 క్వార్ట్, వికారాబాద్ హరితటూరిజంలో 30 సూట్స్లను అందుబాటుల ఉన్నాయని సిఎం వివరించా రు. కరోనా వంటి సున్నిత విషయాలపై రాజకీయాలు చేయవద్దని సూచించారు.
వందేళ్లకోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్
ప్రతి వందేళ్లకోసారి వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. 1890లో ‘స్పానిష్ ఫ్లూ’ వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల మంది చనిపోయారని, ఒక భారతదేశంలోనే 1.01 కోట్ల మంది వరకు చనిపోయారన్నారు. మన రాష్ట్రంలో కరోనా వైరస్ లేకపోయినప్పటికీ విదేశాల నుండి వచ్చేవారితో ఈ వైరస్ సోకుతుందన్నారు. విదేశాల నుండి వచ్చే వారికి శంషాబాద్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ 200 మంది వైద్య సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్ సోకిందని, ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారన్నారు. ఈ వైరస్‌తో దేశంలో ఇద్దరు మాత్రమే చనిపోయారన్నారు. ఒక ఇటలీ వ్యక్తికి పాసీటీవ్ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో ఇద్దరి విషయంలో అనుమానాలు ఉన్నాయని, వారి రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. చైనా, సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ, ప్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో ఈ వ్యాధి అధికంగా ప్రబలిందని, దీంతో ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మన దేశంలోకి అనుమతించొద్దని కేంద్ర ప్రభుత్వం వీసాలు కూడా రద్దు చేసిందని గుర్తు చేశారు. ఒక వేళ ఈ దేశాల నుండి భారతీయులు ఎయిర్‌పోర్ట్‌కు వస్తే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ చేసి, కరోనా నెగెటీవ్ అని తేలితేనే బయటకు పంపించాలని కేంద్రం సూచించినట్టు సిఎం తెలిపారు.
కరోనా కట్టడికి అవసరమైతే రూ. 5వేల కోట్లు
కరోనా వైరస్ నివారణకు అవసరమైతే రూ. 5 వేల కోట్ల ఖర్చు చేస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందని, ఇప్పటికే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మాస్కులు, శానిటైజర్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా సీజ్ చేయాలని ఆదేశించినట్టు వివరించారు. శంషాబాద్ ఎ యిర్‌పోర్ట్ రద్దీగా మారిందన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్లో ప్రతి రోజు 4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 2013 సంవత్సరంలో 88 లక్షల మంది ప్రయాణికులు వస్తే ప్రస్తుతం 2.17 కోట్ల మంది ప్రయాణికులు వ స్తున్నారని, నాడు 200లకు పైగా విమానాలు వస్తే, ప్రస్తుతం 500లకు పైగా విమానాలు వస్తున్నాయని తెలిపారు. పైగా హైదరాబాద్ నుండి అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయని, బెంగళూరు లో కూడా విద్యా, పలు జనసమర్ధక ప్రదేశాలను మూసేశారని, చాలా రాష్ట్రాలలో థియేటర్లు, స్కూళ్లు బంద్ చేశారని తెలిపారు. ఇప్పటికే ఐఎఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
కరోనా ‘పారాసిటమాల్’ వాదన
కరోనా వైరస్‌పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కెసిఆర్, సిఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్క మధ్య ‘పారాసిటమాల్’ చర్చ జరిగింది. కరోనాకు ‘పారాసిటమాల్’ మందు వేసుకుంటే సరిపోతుందని, 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా రాదని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఆ తర్వాత సిఎం కెసిఆర్ సమాధానమిస్తూ ప్రతిదీ రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. ‘పారాసిటమాల్’ విషయం తనకు ఒక శాస్త్రవేత్త ఫోన్ చేసి చెప్పారని, ఈ మాటకు తాను కట్టుబడేఉన్నానన్నారు. ‘అపోజిషన్’లో ఉన్నామని అడ్డం, పొడుగు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. శవాల మీద ప్యాలాలు ఏరుకోవద్దని ఎద్దేవా చేశారు. కెనడాలో ప్రధాని భార్యకు కూడా కరోనా వచ్చిందని, ఆ విషయాన్ని నాలుగు రోజుల తర్వాత ప్రకటించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయని, అన్ని ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పని చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదని భట్టి విక్రమార్క చేసిన ప్రకటన, ఒక దిక్కుమాలిన ప్రకటన అని, ఇది దుర్మార్గమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.
కేంద్రం ‘కాలర్ ట్యూన్’తోనే సరిపెట్టింది
కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ‘కాలర్ ట్యూన్ ’తోనే సరిపెట్టిందన్నారు. చైనాలో పది రోజుల్లో పదివేల పడకల ఆస్పత్రి నిర్మించారని గుర్తు చేశారు. ముందు జాగ్రత్తలు తీసకోకపోవడంతోనే అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించిందన్నారు. అనేక దేశాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ముందు జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. కరోనా నియంత్రణకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కరోనాపై నవంబరు నుండే వార్తలు వస్తున్నాయని, ఇదివరకే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అసలు కరోనా కాంగ్రెస్సే!
RELATED ARTICLES