పెర్త్ : కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపిస్తున్న కారణంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా-న్యూజిలా్‌ండ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దయింది. అయితే కివీస్ 3 వన్డే అలాగే 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడటానికి ఆసీస్ పర్యటన వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సిరీస్ కరోనా కారణంగా రద్దయింది. అయితే ప్రస్తుతం ఈ వైరస్ కారణంగా అని క్రీడా టోర్నీలు నిలిపేస్తునా సమయం లో కూడా ఆసీస్ కివీస్ నిన్న మొదటి వన్డే మ్యాచ్ ఆడాయి. అయితే అది కూడా ఖాళీ స్టేడియం లోనే జరిగింది ఈ మ్యాచ్ లో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ తరువాత జరగాల్సిన మిగితా రెండు మ్యాచ్లు రద్దయ్యాయి. అంటే ఈ సిరీస్ తరువాత జరగాల్సిన టీ20 సిరీస్ కూడా ఆగిపోయిన్నటే. అయితే న్యూజిలా్‌ండ ప్రభుత్వం ఓ కొత్త రూల్ ని తీసుకోస్తుంది. వేరే దేశం నుండి తమ దేశానికి వచ్చే వారందరిన్ని తప్పకుండ 14 రోజులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ రూల్ అమలులోకి రావడానికి ముందే తిరిగి తమ దేశానికి వెళ్లి పోవాలని కివీస్ ఆటగాళ్లు భావిస్తున్నారు. అయితే న్యూజిలా్‌ండ బౌలర్ ’లాకీ ఫెర్గూసన్’ తనకు బాగా గొంతు నొప్పిగా ఉండటం తో అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసారు కానీ టెస్ట్ ఫలితాలు ఇంకా రాలేదు.
ఆసీస్-కివీస్‌ల వన్డే సిరీస్ రద్దు
RELATED ARTICLES