బర్మింగ్‌హామ్ : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్‌లో నెగ్గి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ప్రపంచ 29వ ర్యాంక్‌తో కొనసాగుతున్న లక్ష్యసేన్ చైనాకు చెందిన 18వ ర్యాంక్ షట్లర్ లీ చిక్ యుపై విజయం సాధించాడు. ఈ పోటీలో తొలి సెట్‌లో 17–21తో వెనుకబడ్డ లక్ష్యసేన్ తర్వాతి రెండు సెట్లలో మెరుగైన ప్రదర్శనతో విజయం సాధించాడు. మూడు సెట్లు పూర్తయ్యేసరికి 17–21, 21-8, 21–17 ఆధిక్యంతో గెలుపొందాడు. మరోవైపు సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై మెగా టోర్నీ నుంచి నిష్క్రమించారు. స్టార్ షట్లర్ పీవీ సింధు మాత్రమే బుధవారం అమెరికా క్రీడాకారిణి బీవిన్ జాంగ్‌పై 21–14, 21–17 తేడాతో విజయం సాధించింది. కాగా, లక్ష్యసేన్ రెండో రౌండ్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ విక్టర్ అక్సెల్‌సన్‌తో పోటీ పడనున్నాడు.
రెండో రౌండ్‌లో లక్ష్యసేన్
RELATED ARTICLES